'సర్కార్ 3' విడుదల వాయిదా

22 Mar, 2017 14:51 IST|Sakshi
'సర్కార్ 3' విడుదల వాయిదా

వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో పడ్డ రామ్ గోపాల్ వర్మ.. మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన కెరీర్లో బిగెస్ట్ హిట్స్గా నిలిచిన సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలకు కొనసాగింపుగా సర్కార్ 3  సినిమాను రూపొందిస్తున్నాడు. మరోసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సర్కార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న వర్మ, గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కార్ సినిమాను తన పుట్టిన రోజున ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు.

అయితే అనుకున్న సమయం కన్నా ఈ సినిమాను నెల రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. ముందుగా చెప్పినట్టుగా ఏప్రిల్ 7న కాకుండా మే 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్తో పాటు జాకీష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, యామీ గౌతమ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యం అవుతున్న మూలంగానే సినిమా రిలీజ్ వేసినట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి