మా వంద కోట్ల మాటేమిటి?

22 Mar, 2017 15:03 IST|Sakshi
మా వంద కోట్ల మాటేమిటి?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో తమకు రావాల్సిన వంద కోట్ల రూపాయల కోసం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జయలలిత మరణం కారణంగా ఆమె మీద విధించిన జరిమానాను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేయడంతో.. ఆ తీర్పును మరోసారి సమీక్షించాలని కర్ణాటక కోరుతోంది. ఏదైనా కేసులో శిక్ష పడినప్పుడు దానిపై అప్పీలు చేసినా, నిందితులు జరిమానా చెల్లించడం, జైలుశిక్ష అనుభవించడం లాంటి విషయాలలో మినహాయింపులు, రద్దులు చెల్లబోవని, నిందితులందరికీ సమానత్వం అమలవుతుందని, ఈ కేసులో జైలుశిక్షతో పాటు వంద కోట్ల రూపాయల జరిమానా విధించాని తమ పిటిషన్‌లో తెలిపింది.

ప్రస్తుత కేసులో జయలలిత జైలుశిక్ష అనుభవించే ప్రసక్తి రాదు గానీ.. ఆమెకు విధించిన జరిమానాను మాత్రం తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని కర్ణాటక సర్కారు కోరింది. ఈ కేసులో విధించిన మొత్తం జరిమానాలో జయలలిత వాటాగా 100 కోట్ల రూపాయలు ఉన్న విషయం తెలిసిందే. ఆ మొత్తం కర్ణాటక ప్రభుత్వానికి రావాల్సి ఉండటంతో.. దాని కోసం ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు