‘డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్‌, అడిక్ట్‌ అవుతున్నాను’

23 Dec, 2019 12:14 IST|Sakshi

ప్రేమ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకా దాని గురించి చెప్పడానికి ఏదో మిగిలే ఉంటుంది. ప్రేమలోతును, అందులో మునిగినవారి పరిస్థితిని చెప్పడానికి ‘అమృతరామమ్‌’ సినిమా సిద్ధమైంది. ‘దేర్‌ ఈజ్‌ నో లవ్‌ విత్‌ అవుట్‌ పెయిన్‌’ అనే క్యాప్షన్‌తో సినిమా ఏంటనేది ఒక్క ముక్కలో చెప్పకనే చెప్పారు. మనిషిలో ఏదో మూలన మిగిలి ఉన్న ప్రేమను తట్టిలేపేందుకు ఈ ప్రేమకావ్యం త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. హీరో హీరోయన్లు రామ్‌ మిట్టకంటి, అమితా రంగనాథ్‌ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. ప్రేమలో ఉండే అన్ని కోణాలను స్పృశించేందుకు ప్రయత్నించిందీ చిత్రం.


కాకపోతే ఈ సారి ప్రేమకోసం పరితపించింది, ప్రేమకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది ప్రేమికుడు కాదు, ప్రేయసి. అదే ఈ సినిమాలోని ప్రత్యేకత. ‘తన ప్రేమని నువ్వు గెలవాలంటే ముందు నువ్వు ఓడిపోవాలి’, ‘ప్రేమలో సంతోషాలే కాదు, త్యాగాలు కూడా ఓ భాగమే’ ‘రోజురోజుకీ నాకు డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్‌, నేను నీకు అడిక్ట్‌ అవుతున్నాను’ ‘ఈ ప్రపంచంలో చావుకంటే నరకం ఏంటో తెలుసా... ఓ మనిషిని పిచ్చిగా ప్రేమించడం’  వంటి డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ప్రేమించినవాడి కోసం అమ్మాయి పడే వేదనని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ఇప్పటికే విడుదలైన ప్రేమగీతాలు సినిమాకు ఆయువుపట్టుగా మారాయి. ఈ చిన్న సినిమా సురేష్‌బాబు లాంటి పెద్ద నిర్మాతను ఆకట్టుకుంది. ఈ సినిమాకు దర్శకుడు: సురేందర్‌ కొంటడ్డి. నిర్మాత: ఎస్‌ఎన్‌ రెడ్డి. సంగీత దర్శకుడు: ఎన్‌ఎస్‌ ప్రసు. గేయరచయిత: చైతన్యప్రసాద్‌, మధుసూదన్‌ రామదుర్గం, కృష్ణ చైతన్య.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు