ఓ ప్రేమ కథ

27 Nov, 2017 01:17 IST|Sakshi

విరాజ్‌ జె. అశ్విన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధి కుమార్, రాధా బంగారు కథానాయికలు. దర్శకుడు ఎన్‌. శంకర్‌ వద్ద అసోసియేట్‌గా పని చేసిన టి. ప్రతాప్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధౌజండ్‌ లైట్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీఎస్‌ రాజు అల్లుడు కేఎల్‌ఎస్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.

ప్రముఖ ఫైనాన్షియర్‌ సత్యరంగయ్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కేఎల్‌ఎస్‌ రాజు క్లాప్‌ ఇచ్చారు. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘దర్శకుడిగా ప్రతాప్‌కిది మొదటి సినిమా. మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత. ‘‘దర్శకునిగా అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి థ్యాంక్స్‌’’ అన్నారు ప్రతాప్‌. కాశీ విశ్వనాథ్, అనీష్, వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: టీఆర్‌ కృష్ణ చేతన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు