బికినీ ఫొటో ఎడిట్ చేసిన న‌టుడి భార్య‌

2 Apr, 2020 16:21 IST|Sakshi

ఎలాంటి మేక‌ప్ వేసుకోకున్నా అందంగా క‌నిపించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో యాప్‌లు మార్కెట్లో కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏ ఫొటో పోస్ట్ చేయాల‌న్నా దాన్ని కాసింతైనా ఎడిట్ చేయందే సోష‌ల్ మీడియాలో పెట్టే సాహ‌సం చేయ‌ట్లేదు చాలా మంది. అయితే ఈ ప‌ని సెల‌బ్రిటీలు కూడా చేస్తారా అంటే ఓ న‌టుడి భార్య షేర్ చేసిన ఫొటో చూస్తుంటే అవున‌నే తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ళుతున్న వేళ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ లాక్‌డౌన్ పుణ్యమాని న‌టుడు మిలింద్ సోమ‌న్ త‌న భార్య అకింతా కోన్వార్‌తో క‌లిసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఆమె గ‌తేడాది బికినీ ధ‌రించిన ఫొటోను అభిమానుల‌తో పంచుకుంది. (అశ్లీల వీడియోల పేరుతో నమితకు బెదిరింపు)

అయితే గ‌తేడాది వేస‌వి కాలానికి ఇప్ప‌టి స‌మ్మ‌ర్‌కు ప‌రిస్థితులు ఎంత‌గానో మారిపోయాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. "గ‌తేడాది వేస‌విలోనూ చ‌ల్ల‌ద‌నాన్ని ఆస్వాదించాను. ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. ఎటువైపు వెళుతున్నామో.." అంటూ ఆశ్చ‌ర్యాన్ని క‌న‌ బ‌ర్చుతూ తాను బికినీ ధ‌రించి ఉన్న‌ ఫొటోను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోపై ఆమె అభిమాని ఓ స‌ందేహాన్ని లేవనెత్తాడు. "చ‌ర్మ రంగు కాంతివంతంగా క‌నిపించేలా ఫొటోను అంత‌లా ఎందుకు ఎడిట్ చేశారు? మీ చామ‌న‌ఛాయ రంగే మాకు న‌చ్చుతుంద‌"ని చెప్పుకొచ్చాడు. దీనికి అంకితా స్పందిస్తూ.. ఇది కేవ‌లం  ఇన్‌స్టాగ్రామ్ ఫిల్ట‌ర్ అని తేలిక‌గా స‌మాధాన‌మిచ్చింది. క్వారంటైన్ వేళ ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసున్న ఫొటోల‌ను సైతం పంచుకుంటూ అభిమానుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉంటోంది. (కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!)

మరిన్ని వార్తలు