బిజీ అవుతోన్న ప్రేమమ్ బ్యూటి

12 Jan, 2017 13:18 IST|Sakshi
బిజీ అవుతోన్న ప్రేమమ్ బ్యూటి

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళీ బ్యూటి అనుపమా పరమేశ్వరన్. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన అనుపమ ఇప్పుడు వరుస అవకాశలతో బిజీ అవుతోంది. ఈ బ్యూటి తెలుగులో చేసిన రెండో సినిమా ప్రేమమ్ కూడా వరుస అవకాశాలను తెచ్చపెడుతోంది.

ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్, శర్వానంద్ కు జంటగా నటించిన శతమానంభవతి ఈ సంక్రాంతి కానుకగా శనివారం విడుదలవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో కూడా ఈ ముద్దుగుమ్మకే చాన్స్ ఇచ్చాడు. నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాతో పాటు సుకుమార్, రామ్ చరణ్ ల సినిమా, ఎన్టీఆర్, బాబీల సినిమాలకు కూడా అనుపమ పేరు పరిశీలనలో ఉంది.