‘సైరా’లో అనుష్క స్పెషల్‌ అపియరెన్స్‌

5 Feb, 2019 03:17 IST|Sakshi
అనుష్క

2006లో చిరంజీవి ‘స్టాలిన్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేశారు అనుష్క. మళ్లీ పదమూడేళ్ల తర్వాత అలాంటి స్పెషల్‌ అపియరెన్సే ‘సైరా’ సినిమాలో ఇవ్వబోతున్నారట. అయితే అప్పుడు పాటకు మాత్రమే పరిమితమైతే ఇప్పుడు సీన్స్‌లో కూడా కనిపిస్తారట. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లు. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమాలోకి అనుష్క కూడా జాయిన్‌ అవ్వనున్నారట. ఓ స్పెషల్‌ రోల్‌లో కొన్ని నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించనున్నారట అనుష్క. ప్రస్తుతం పాండిచ్చేరీ దగ్గర షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: రత్నవేలు.

మరిన్ని వార్తలు