డబ్బు కాదు ... ప్రేమ, ప్రశంసలే ముఖ్యం

17 Oct, 2014 15:00 IST|Sakshi
డబ్బు కాదు ... ప్రేమ, ప్రశంసలే ముఖ్యం

ముంబై :  ప్రేమ, ప్రశంసలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె స్పష్టం చేశారు. ఆ రెండు తన జీవితంలో ముఖ్యమైనవే కాదు  విలువైనవి కూడా అని ఆమె తెలిపారు. విజయానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వనిని ఆమె అన్నారు. డబ్బుకు అయితే చివరి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఆ ప్రశంసల కోసమే సినిమాలలో నటిస్తున్నానంటే పొరపాటు పడినట్లేనని దీపికా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలు వెరైటీ పాత్రలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న దీపికా పదుకొనె శుక్రవారం ముంబైలో విలేకర్లతో మాట్లాడారు.

హీరోయిన్ కావడం అంత ఈజీ కాదని.... హీరోయిన్ కావడం కోసం తాను ఎంత కష్టపడింది ఆమె వివరించింది.  తాను హీరోయిన్గా కంఫర్ట్ జోన్ చేరానని భావిస్తున్నానన్నారు. హృదయానికి హత్తుకునేలా ఉండే కథలలో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు.  అంతేకాని బాక్సాఫీసు వద్ద తాను నటించే సినిమా హిట్ అవుతుందా? లేక ఆ చిత్రం కోట్లాది రూపాయిల వ్యాపారం చేస్తుందా అని ఆలోచించనని తెలిపారు.

దీపికా పదుకొనె తాజాగా నటించిన చిత్రం హ్యాపీ న్యూ ఇయర్. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ చిత్రం విడుదలపై అందరు దృష్టి సారించారు.  ఓం శాంతి ఓం చిత్రంలో దీపికా నటనపనై విమర్శకులు విమర్శలు కురిపించారు. ఆ తర్వాత ఆమె నటించిన కాక్ టయిల్, యే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్ప్రెస్... చిత్రాలలో ఆమె నటనను విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.