అసలేం జరిగింది?

7 Mar, 2020 05:49 IST|Sakshi
మహేంద్రన్, కరోన్య కత్రిన్‌

మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్‌ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్‌ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. ఏబీఆర్‌ ప్రొడక్ష¯Œ ్స, జిఎస్‌ ఫిలిమ్స్‌ పతాకంపై అనిల్‌ బొద్దిరెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ బండారి మాట్లాడుతూ– ‘‘ఒక్క క్షణంలో మన జీవితంలో జరిగే మార్పును తెలిపే కథ ఇది. క్రైౖమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్‌ కాపీ సిద్ధమైంది. సెన్సార్‌ పూర్తయింది. ఈ నెల 9న ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించి, నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో నా పాత్ర ఒకరకంగా చెప్పాలంటే రవితేజగారి పాత్రలా అనిపిస్తుంది’’ అన్నారు మహేంద్రన్‌. ‘‘థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ షానీ సాల్మన్‌. ‘‘ఈ చిత్రంలో సావి అనే మంచి పాత్ర చేశాను’’ అన్నారు కారుణ్య చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌ అర్జున్, కెమెరా: కర్ణ ప్యారసాని.

మరిన్ని వార్తలు