నయన్‌ విషయంలోనూ అలాగే జరగనుందా?

22 Sep, 2019 10:21 IST|Sakshi

నయనతార విషయంలోనూ అది జరగనుందా? తాజాగా జరుగుతున్న చర్చ ఇదే. నయనతార లేడీ సూపర్‌స్టార్‌.. అంతే కాదు లేడీ బ్యాచిలర్‌ కూడా. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేస్తున్న నటి నయనతార. ఏ ఇతర హీరోయిన్‌ తన దరిదాపులకు రాలేనంతగా వెలిగిపోతోంది ఈ బ్యూటీ. అలాంటి నయనతార వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి విషయాల్లో రెండుసార్లు ఘోరంగా ఓడిపోయింది. ఆ సంఘటనలు నయనతారకు చాలా పాఠాలే నేర్పినట్లు తెలుస్తోంది.

అందుకే ఇక పెళ్లి జోలికి వెళ్లకుండా యువ దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని పెళ్లి, కాపురం వంటి బాదరబంది లేకుండా హాయిగా సహజీవనం చేస్తోంది. అలా ప్రస్తుతం ఆనందంగా గడిపేస్తోంది. అలాంటిదిప్పుడు మరోసారి పెళ్లి అనే పదం ఈ అమ్మడిని తొందరపెడుతోందనే ప్రచారం సాగుతోంది. అది ప్రియుడి కుటుంబం నుంచి పెరుగుతోందని టాక్‌. దీన్ని నటి నయనతార లైట్‌గా తీసుకుంది.

విఘ్నేశ్‌శివన్‌కు సర్ది చెబుతూ సహజీవనంతోనే కాలం గడిపేస్తోంది. ఇలాంటి సమయంలో జ్యోతిష్యం రూపంలో పెళ్లి ఆమెను వెంటాడుతోంది. అవును బాలాజీహాసన్‌ అనే స్టార్‌ జ్యోతిష్కుడు పలువురు సినీ తారలకు చెప్పిన విషయాలు నిజమయ్యాయి. అదే జ్యోతిష్కుడు నయనతార జాతకాన్ని వెల్లడించారు. గణితశాస్త్ర జ్యోతిష్కు డైన బాలాజీహాసన్‌ గత ఏడాది ఒక టీవీ కార్యక్రమంలో 2019లో నటి నయనతార వివాహం జరుగుతుందని పేర్కొన్నారు.

కాగా ఇటీవల దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ పుట్టిన రోజు వేడుకను ఆయన ప్రియురాలు నయనతార ఘనంగా నిర్వహించింది. అంతే కాదు ఈ జంట డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై జ్యోతిష్కుడు బాలాజీహాసన్‌ తాజాగా తన ట్విట్టర్‌లో స్పందించారు. అందులో 2018లో ఒక టీవీ చానల్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేను 2019లో కుమారి నయనతార వివాహం చేసుకునే అవకాశం ఉందని చెప్పాను. ఆ విషయం చాలా మందికి తెలుసు. ఇప్పుడు (20వ తేదీన) ఇక ప్రముఖ టీవీ చానల్‌లో ఆ విషయం గురించి వార్తలు ప్రసారం అవుతున్నాయి.

నటుడు విశాల్, ఆర్య, నమల్‌ రాజపక్సే, నటి సమంత, దర్శకుడు అట్లీ వంటి వారికి గణిత సంఖ్యాశాస్త్రం చెప్పినవి జరిగినట్లు నయనతారకు జరగనుంది. వివాహం విషయంలో గణితసంఖ్యా శాస్త్రంలో నాకు ఇది ఏడవ విజయం. అయితే ఈయన చెప్పిన జ్యోష్యంతో దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ సంబరపడవచ్చు కానీ, నయనతారకు పెళ్లి కాకూడదని కోరుకునే ఆమె అభిమానులు మాత్రం చింతాక్రాంతులవుతున్నారు. పెళ్లి అయితే తన అభిమాన నటిని ఇక సినిమాల్లో చూడలేమనే భావనే వారి భయానికి కారణం.

అయితే వారి భయపడడంలో అర్థం లేదు. ఎందుకంటే వివాహానంతరం నటనకు స్వస్తి చెబుతానని నయనతార ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. కొత్త చిత్రాలను అంగీకరిస్తూనే ఉంది. విజయ్‌కి జంటగా నటిస్తున్న బిగిల్‌ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. అంతకు ముందుగా చిరంజీవి సరసన నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబరు 2న విడుదలకు ముస్తాబవుతోంది. ఇక సూపర్‌స్టార్‌లో జత కట్టిన దర్బార్‌ చిత్రం వచ్చే సంక్రాంతికి తెరపైకి రానుంది. త్వరలో ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ను నిర్మాతగా చేసి నిర్మించనున్న హర్రర్, థ్రిల్లర్‌ కథా చిత్రంలో మిలింద్‌రావ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతోంది. మరిన్ని అవకాశాలు ఈ సంచలన నటి కోసం ఎదురుచూస్తున్నాయన్నది సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా