సాక్షి జర్నలిస్టులకు అవార్డులు

5 Oct, 2017 02:00 IST|Sakshi

ఇండీవుడ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గతేడాది హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు సినిమా జర్నలిజమ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కొందరు పాత్రికేయులకు బుధవారం హైదరాబాద్‌లో అవార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా ‘సాక్షి’ పత్రిక సినిమా పేజ్‌ ఇన్‌చార్జ్‌ డి.జి. భవాని, ‘సాక్షి’ టీవీ ఫిల్మ్‌ కరస్పాండెంట్‌ నాగేశ్వరరావు, ‘సాక్షి’ టీవీ డిప్యూటీ బ్యూరో చీఫ్‌ జోయల్‌లను ఇండీవుడ్‌ సంస్థ నిర్వాహకులు అవార్డులతో సత్కరించారు.  తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, దర్శకుడు ఎన్‌. శంకర్, ‘ఇండీవుడ్‌’ సోహన్‌ రాయ్, టీఎఫ్‌సీసీ చైర్మన్‌ మురళీమోహన్‌ రావు చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. ‘‘ఈ ఏడాది ‘ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌’ డిసెంబర్‌ 1 నుంచి 4 వరకూ హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అని సోహన్‌ రాయ్‌ తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు