అందరి కళ్లు బాహుబలి 2నే వెతికాయి

13 Dec, 2017 16:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బాహుబలి -2 : ది కన్‌క్లూజన్‌ మరో రికార్డు సొంతం చేసుకుంది. 2017కు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో అత్యంత ఎక్కువసార్లు శోధించిన అంశంగా ముందు వరుసలో నిలిచింది. 2017 సంవత్సరంలో అత్యంత ఎక్కువగా నెటిజన్లు శోధించిన టాప్‌ ట్రెండింగ్‌ అంశాల జాబితాను గూగుల్‌ ప్రకటించింది. అందులో ఇప్పటికే పలు రికార్డులను బద్ధలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాహుబలి 2 తొలి స్ధానం దక్కించుకుంది. అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌), లైవ్‌ క్రికెట్‌ స్కోర్‌ అనేది మూడో సెర్చింగ్‌ వర్డ్‌గా నిలిచింది.

మొత్తం మీద శోధించిన టాప్‌ అంశాలు, టాప్‌ ట్రెండింగ్‌ వార్తలు, టాప్‌ ట్రెండింగ్‌ ఎంటర్‌ ట్రైనర్స్‌, టాప్‌ ట్రెండింగ్‌ మూవీస్‌, టాప్‌ ట్రెండింగ్‌ సాంగ్స్‌, స్పోర్టింగ్‌ ఈవెంట్స్‌, టాప్‌ ట్రెండింగ్‌ నియర్‌ మి, టాప్‌ ట్రెండింగ్‌ హౌ టు, టాప్‌ ట్రెండింగ్‌ వాట్‌ ఈజ్‌ వంటి పేరిట మొత్తం తొమ్మిది అంశాలతో జాబితాను సిద్ధం చేసి గూగుల్‌ విడుదల చేసింది. మొత్తంగా చూసినప్పుడు బాలీవుడ్‌ అంశాలు, క్రీడలకు సంబంధించినవి ఉన్నట్లు కూడా వెల్లడించింది.

మరిన్ని వార్తలు