సూపర్‌ కంప్యూటర్‌ కంటే వేగంగా గూగుల్‌ ఏఐ వాతావరణ సూచనలు!

15 Nov, 2023 17:15 IST|Sakshi

ఇంతవరకు వాతావరణ సూచనలివ్వడంలో ఒక్కోసారి సైన్స్‌కి కూడా అంత్యంత క్లిష్టంగా ఉంటుంది. అలాంటిది ఈ గూగుల్‌ ఏఐ వాతావరణ సూచనలకు సంబంధించిన సమాచారాన్ని చాలా కచ్చితమైన విశ్లేషణతో ఇస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గూగుల్‌ ఏఐ వెదర్‌మ్యాన్‌గా వ్యవహరించనుంది. ఏకంగా పది రోజులు ముందుగానే వాతావరణ సమాచారాన్ని ఇస్తుందట. ఎలా అంచనా వేస్తుందంటే?..

సీతాకోక చిలుకలు వచ్చాయంటే వర్షం వచ్చే సూచనలున్నాయని అర్థం. ఇది అందరికీ తెలిసిందే. ఒక వారం ముందుగానే వాతావరణ సమాచారాన్ని తెలియజేయడాన్ని సాధారణ న్యూమరికల్‌ వెదర్‌ ప్రిడిక్షన్‌(ఎన్‌డబ్ల్యూపీ) అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిశీలనలను ఇన్‌పుట్‌ డేటాగా తీసుకుని సూపర్‌ కంప్యూటర్‌ సంక్లిష్ట భౌతిక సమీకరణాలను ఉపయోగించి చెప్పేది. కానీ ఇప్పుడు గూగుల్‌ శక్తిమంతమైన హార్డ్‌వేర్‌ల సాయంతో సంఖ్యలను తొందరగా కాలిక్యులేట్‌ చేయగల గ్రాఫ్‌ కాస్ట్‌ని ఆవిష్కరించింది. ఈ ఏఐ ఉపగ్రహ చిత్రాలు, రాడార్‌లు అందించిన  40 ఏళ్ల విలువైన వాతావరణ పునర్విశ్లేషణ డేటాపై శిక్షణ పొందింది.

ఈ గ్రాఫ్‌కాస్ట్‌ ఆరుగంటల క్రితం వాతావరణ స్థితి, ప్రస్తుత స్థితిని పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత ఆరుగంటల నుంచి వాతావరణ స్థితిని అంచనావేయడానికి తన వద్ద ఉన్న డేటాను ఉపయోగిస్తుంది. దీని ఆధారంగా పది రోజుల వరకు సూచనను అందిస్తుంది. ఈ గ్రాఫ్‌కాస్గ్‌ భూమి ఉపరితలం చుట్టూ మిలియన్ల కంటే ఎక్కువ గ్రిడ్‌ పాయింట్లలో దీన్ని చేస్తుంది. ఇది రేఖాంశం, అక్షాంశం తోసహ ప్రతి పాయింట్‌ వద్ద ఉష్ణోగ్రత, తేమ, పీడనం, గాలి దిశ, వేగం అన్నింటిని పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తుంది. అంతేగాదు ఈ గ్రాఫ్‌కాస్ట్‌ ప్రస్తుత సూపర్‌ కంప్యూటర్‌లో ఉన్న హై రిజల్యూషన్‌ ఫోర్‌కాస్ట్‌(హెచ్‌ఆర్‌ఈఎస్‌) అనే అనుకరణ వ్యవస్థలా పనిచేస్తుంది కానీ పదిరోజుల నాటి వాతావరణ సూచనను ఇవ్వగలదు.

అలాగే 90% హెచ్‌ఆర్‌ఈఎస్‌ కంటే కచ్చితమైన సూచనను అందిస్తుంది. ఇక భూమిపై ఉండే పోరల్లో ట్రోపోస్పియర్‌ పోర వద్ద కచ్చితమైన అంచనాలు మన రోజూ వారి జీవితానికి ఉపయుక్తంగా ఉన్నాయి. పైగా హెచ్‌ఆర్‌ఈఎస్‌ కంటే ముందే వాతావరణ సూచనలను అందించే సామర్థ్యాన్ని గూగుల్‌ ఏఐ ప్రదర్శించింది. అంతేగాదు తుపాను ఎక్కవ వస్తుందో తొమ్మిది రోజులు ముందుగానే ఏఐ కచ్చితమైన అంచనా వేసింది. ఐతే సంప్రదాయ వాతావరణ అంచనాలు కనీసం ఆరు రోజులు ముందుగానీ నిర్థారించవు. ఈ గ్రాఫ్‌కాస్ట్‌ కోడ్‌ ఓపెన్‌సోర్స్‌ అని గూగుల్‌ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దానితో ప్రయోగాలు చేయడానికి, రోజూవారి వాతావరణ సూచనలు ఇవ్వడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.

(చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్‌ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు)

మరిన్ని వార్తలు