యాక్షన్‌కి వేళాయె

6 Sep, 2019 05:33 IST|Sakshi

బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సోనాల్‌ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘బాలకృష్ణ నటిస్తోన్న 105వ చిత్రమిది. ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ గురువారం మొదలైంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ఓ లుక్‌కి, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్‌ భట్, కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సహ నిర్మాతలు: వి.రావ్, పత్సా నాగరాజు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా