ఓ సీత కథ

9 Mar, 2019 00:47 IST|Sakshi
సాయి శ్రీనివాస్, కాజల్‌

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా రూపొందుతున్న సినిమా ‘సీత’. రామబ్రహ్మాం సుకంర నిర్మిస్తున్నారు. అజయ్‌ సుకంర, అభిషేక్‌ అగర్వాల్‌ సహ–నిర్మాతలు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌తో పాటు సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం.

ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కాజల్‌ పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయి. పురాణాల్లో సీత ఫుల్‌ పాజిటివ్‌. ఆ సీతకు ఈ రీల్‌ సీతకు సంబంధం లేదు. ఈ రీల్‌ సీతలో కొత్త యాంగిల్‌ చూడబోతున్నామన్న మాట. ఈ సినిమాకు కిషోర్‌ గరికపాటి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు