వాళ్ల బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది : సల్మాన్‌

31 Aug, 2019 15:53 IST|Sakshi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఓ ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోతురాజు వేషదారణలో ఉన్న కొంతమంది వ్యక్తులను సల్మాన్‌ కలిసి వీడియో అది. వీడియోలో సల్మాన్‌ వారితో సరదాగా ముచ్చటించటంతో పాటు వారి కొరడాతో తాను కూడా కొట్టుకున్నాడు. సల్మాన్‌ లాంటి సూపర్‌ స్టార్‌ తమతో కొంత సమయం గడపటంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన సల్మాన్‌ ‘వారి అనుభూతుల్ని, బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది. ఇది మీపై మీరు ప్రయత్నించకండి. మరొకరి మీద కూడా ప్రయోగించకండి’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు సల్మాన్‌. ప్రస్తుతం సల్మాన్, ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దబాంగ్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Thr is pleasure in feeling n sharing thr pain ahhhhhhhhhhhh Baccha party don't try this on your self or on any 1 else

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా