'బాలీవుడ్ ఫైట్స్ బోర్ కొడుతున్నాయి'

15 Oct, 2016 12:36 IST|Sakshi
'బాలీవుడ్ ఫైట్స్ బోర్ కొడుతున్నాయి'

బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ నెలాఖరున రిలీజ్‌కు రెడీ అవుతున్న శివాయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న అజయ్, తనకు బాలీవుడ్ యాక్షన్ సీన్స్ బోర్ కొడుతున్నాయంటూ కామెంట్ చేశాడు. ఫైట్ మాస్టర్ వీర్ దేవగన్ వారసుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్, యాక్షన్ సీన్స్‌పై చేసిన కామెంట్స్‌ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న శివాయ్ సినిమాలో హీరోగా నటిస్తున్న అజయ్ ఆ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సందర్భంగా బాలీవుడ్ యాక్షన్ సీన్స్ బోర్ కొట్టాయన్న అజయ్ దేవగన్, తన సినిమాతో కొత్త తరహా యాక్షన్‌ను ట్రై చేశానని ప్రకటించాడు. 2008లో తెరకెక్కిన 'యు మీ ఔర్ హమ్' సినిమాతో మెగాఫోన్ పట్టిన అజయ్, రెండో ప్రయత్నంగా శివాయ్‌ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఐదేళ్ల క్రితమే ఈ సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేసినా.. అప్పట్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కారణంగా వాయిదా వేసినట్టుగా తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో అఖిల్ ఫేం సయేషా సైగల్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది.