కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

27 Jul, 2019 11:44 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ డ్రామా డియర్‌ కామ్రేడ్‌. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమాకు సాండల్‌వుడ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్ణాటకలో కన్నడ వర్షన్‌ కన్నా తెలుగు వర్షన్‌కే ఎక్కువగా థియేటర్లు కేటాయించటంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కావాలనే తమపై తెలుగు భాషను రుద్దుతున్నారంటూ ‘బాయ్‌కాట్‌ డియర్ కామ్రేడ్‌’ (#BoycottDearComrade) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రధాన నగరాల్లో కూడా డియర్‌ కామ్రేడ్‌ కన్నడ వర్షన్‌కు పెద్దగా థియేటర్లు దక్కకపోవటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కన్నడలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక హీరోయిన్‌గా నటించటం, ప్రమోషన్‌ కార్యక్రమాలకు కేజీఎఫ్‌ హీరో యష్ హాజరు కావటంతో డియర్‌ కామ్రేడ్‌పై కర్ణాటకలో మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. సినిమా నిడివి, స్లో నేరేషన్‌లపై విమర్శలు వినిపించాయి. అయితే సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావటం, విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్‌ అ‍న్ని కలిసి డియర్‌ కామ్రేడ్ సినిమా తొలి రోజు 11 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శని, ఆది వారాలు సెలవు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు.
(మూవీ రివ్యూ : డియర్‌ కామ్రేడ్‌)

మరిన్ని వార్తలు