నాలో ఆ ఇద్దరూ ఉన్నారు

27 Jun, 2019 00:27 IST|Sakshi
ఆది సాయికుమార్

‘‘స్క్రిప్ట్‌లో దమ్ముంటేనే లిప్‌లాక్‌ సీన్స్‌లో నటిస్తా. అయితే అలాంటి సీన్లు చేసేవారిని నేను తప్పు పట్టడం లేదు. నా సినిమాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ చూడాలనుకుంటా’’ అన్నారు ఆది సాయికుమార్‌. రచయిత ‘డైమండ్‌’ రత్నబాబు దర్శకునిగా పరిచయం అవుతున్న సినిమా ‘బుర్రకథ’. ఇందులో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లు. శ్రీకాంత్‌ దీపాల, కిషోర్, కిరణ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్‌ చెప్పిన విశేషాలు.

► చాలెంజింగ్‌ పాత్రలు చేసినప్పుడే మనలోని బెస్ట్‌ బయటకు వస్తుంది. ఈ సినిమాలో రెండు బుర్రలు ఉన్న అభిరామ్‌ క్యారెక్టర్‌ చేశాను. నాకు సవాల్‌గా అనిపించింది. రెండు పాత్రల మధ్య వేరియేషన్స్‌ సరిగా చూపించానా? లేదా? అనే విషయంలో ఆడియన్స్‌ ఎలా డిసైడ్‌ చేస్తారో అని భయంగా ఉంది.

► ఒక మనిషిలో రెండు బుర్రలు ఉన్నట్లు నేనొక ఆర్టికల్‌ చదివాను. ఈ కాన్‌ఫ్లిక్ట్‌ సబ్జెక్ట్‌ని సింపుల్‌గా, ఎంటర్‌టైనింగ్‌ వేలో చూపించారు రత్నబాబు. అభి, రామ్‌ క్యారెక్టర్ల విషయంలో ఆడియన్స్‌కు మొదటి 15 మినిట్స్‌లోనే క్లారిటీ వస్తుంది. అభిది జోవియల్‌ క్యారెక్టర్‌. రామ్‌ లోకజ్ఞానం తెలిసినవాడు. నాలో అభి–రామ్‌ ఇద్దరూ ఉన్నారు. అభి–రామ్‌ క్యారెక్టర్స్‌ మధ్య రాజేంద్రప్రసాద్‌గారు నలిగిపోవడం ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. మా సినిమాతో పాటు మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ సోలో రిలీజ్‌ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం.

► ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పేరు, డబ్బు... ఒక సినిమాకు ఈ మూడు అంశాలు వస్తే ఆ చిత్రం హిట్‌గా భావిస్తాను. ‘ప్రేమకావాలి, లవ్లీ’  సినిమాల తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ని అందుకోలేకపోయాను. ఇందుకోసం ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకుంటూ హిట్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను.

► నేను అంగీకరించని సినిమాలు కొన్ని సూపర్‌హిట్‌ సాధించాయి. మరికొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. నేను వదులుకున్న సినిమా హిట్‌ సాధించిందన్న బాధ నాకు లేదు. ఎందుకంటే మన జడ్జ్‌మెంట్‌ అన్ని వేళలా  కరెక్ట్‌గా ఉండదు. ఈ విషయంలో ‘నీకు టేస్ట్‌ లేదు’ అని మా సిస్టర్‌ నన్ను ఆటపట్టిస్తుంది.

► మా నాన్నగారికి (సాయికుమార్‌) కన్నడలో నటుడిగా మంచి పేరు ఉంది కదా అని నేను అక్కడ సినిమాలు చేయలేను. ముందుగా తెలుగులో మంచి హిట్‌ సాధించి, ఆ తర్వాత కన్నడగురించి ఆలోచిస్తాను. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మా పాప నా షూటింగ్‌లకు వస్తోంది.

► నా కెరీర్‌లోని గ్యాప్‌ను నేను ప్లాన్‌ చేయలేదు. ప్రస్తుతానికి విలన్‌ పాత్రలు చేయాలనే ఆలోచన లేదు. కథ నచ్చితే మల్టీస్టారర్‌ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ‘ఆపరేషన్‌ గోల్డ్‌షిఫ్‌’లో అర్జున్‌ పండిట్‌ అనే పాత్ర చేశాను. ‘జోడి’ ఆల్మోస్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా