ప్రజాస్వామ్యం ధనస్వామ్యమైంది

27 Jun, 2019 00:27 IST|Sakshi
ఆర్‌. నారాయణమూర్తి

‘‘ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. పవిత్రమైన ఓటు విలువ ఏంటి? భ్రష్టు పట్టిపోతున్న నేటి సమకాలీన రాజకీయాలు, అస్తవ్యస్తమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని ఎలా మనం పరిరక్షించుకోవాలి?’’ అనే నేపథ్యంలో మా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా రూపొందింది అని ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. ఆయన లీడ్‌రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జూలై 12న రిలీజ్‌ కానుంది. హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని ప్రముఖుల కోసం ప్రదర్శించారు.

అనంతరం ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఎన్నికల కోసం రాజకీయ నాయకులు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో ప్రజాస్వామ్యం ధనస్వామ్యమైంది. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే మా సినిమా అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది’’ అన్నారు. రాజకీయ నాయకులు వి.హనుమంతరావు, మధుసూదనాచారి, లక్ష్మణ్, ఆర్‌.కృష్ణయ్య, గాజుల శ్రీనివాస గౌడ్, జస్టిస్‌ ఈశ్వరయ్య, విమలక్క, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ తదితరులు సినిమాని చూసి, అభినందించారు.

మరిన్ని వార్తలు