ఇంటివాడు కాబోతున్న చలాకీ చంటీ!

24 Mar, 2016 20:08 IST|Sakshi
ఇంటివాడు కాబోతున్న చలాకీ చంటీ!

హైదరాబాద్‌: ఓ టీవీ చానెల్‌లో 'జబర్దస్త్'కామెడీ షో ద్వారా ఫేమస్‌ అయిన బుల్లితెర నటుడు చలాకీ చంటీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన వివాహం నిశ్చితార్థం బుధవారం జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వేడుక ఫొటోలను చంటీ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు చేశాడు. నిశ్చితార్థం జరిగింది. ఈమెనే నా కాబోయే బెటర్ హాఫ్‌ అంటూ చంటీ కామెంట్‌ పెట్టారు.

'జబర్దస్త్‌' కామెడీ షోలో చలాకీ చంటీది ప్రత్యేకమైన పంథా. తనదైన కామెడీ పంచ్‌లతో అలరించే చంటీకి ఇంకా పెళ్లి కాలేదని సహచరులు స్కిట్లలో అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటివాడు కాబోతున్నానన్న వార్తతో చంటీ తన అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు.