ఆత్మసంతృప్తి కోసం ఆ పని చేస్తున్నా: రాశీఖన్నా

2 Dec, 2023 09:19 IST|Sakshi

తమిళసినిమా: నటి రాశీఖన్నా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ అంటూ చక్కర్లు కొడుతున్న నటి ఈ బ్యూటీ. చాలా బోల్డ్‌ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ సినీ వర్గాల్లో అటెన్షన్‌కు గురిచేస్తున్న రాశీఖన్నా తెలుగులో కొన్ని హిట్‌ చిత్రాల్లో నటించి పాపులర్‌ అయ్యింది. అయితే ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లో ఎక్కువ దృష్టి సారిస్తోంది.

కాగా తమిళంలో అరణ్మణై 4 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా బ్యూటీ గురువారం తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. పలువురు సినీ ప్రముఖులు అందించిన శుభాకాంక్షల్లో మునిగిపోయింది. కాగా ఈ సందర్భంగా ఆమె తన తోటలో కొన్ని మొక్కలను నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది.

అందులో పేర్కొంటూ ‘నా కల్లను రంజింపజేసే విధంగా, నా ఆత్మను సంతృప్తి పరిచే విధంగా ఈ చిన్న బాధ్యతను తీసుకున్నాను. పలు కారణాలతో మొక్కలు పెంచుతున్నాను. ముఖ్యంగా చెట్టు నాకు సంతోషాన్ని పంచుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు’ అని పేర్కొంది. నాటిన మొక్కల ఫొటోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

A post shared by Raashii Khanna (@raashiikhanna)

మరిన్ని వార్తలు