చార్మి కథానాయికగా ‘ప్రతిఘటన’ చిత్రం

8 Jul, 2013 02:19 IST|Sakshi
చార్మి కథానాయికగా ‘ప్రతిఘటన’ చిత్రం
చార్మి కథానాయికగా ‘ప్రతిఘటన’ చిత్రం రూపొందనుంది. ఇది టి.కృష్ణ ‘ప్రతిఘటన’కు రీమేక్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ సినిమాకు ఈ సినిమాకూ అస్సలు సంబంధం లేదు. ఇది తమ్మారెడ్డి భరద్వాజ్ ‘ప్రతిఘటన’. కొంత విరామం తర్వాత తమ్మారెడ్డి తెరకెక్కించనున్న  చిత్రమిది. 
 
 మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, సై ఆట, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ వంటి స్త్రీ ప్రధాన చిత్రాల్లో నటించి నటిగా తన సత్తా  ఏంటో ఇప్పటికే చాటారు చార్మి. ఆమె నటించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘ప్రేమ ఒక మైకం’ త్వరలో విడుదల కానుంది. అందులో  ఆమె వేశ్య పాత్రతో మెప్పించబోతున్నారు. ఆ సినిమా తర్వాత చార్మి నటించబోయే సినిమా ఈ ‘ప్రతిఘటన’. 
 
 ఇందులో చార్మి జర్నలిస్ట్‌గా నటించనున్నారు. ‘‘నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. కానీ ఎక్కడా వివాదాలకు తావుండదు. పూర్తి స్థాయి వాణిజ్య చిత్రమిది. ఈ కథ వినగానే ఉద్వేగానికి లోనయ్యాను. నా పాత్రను ప్రతి ఒక్కరూ అభినందిస్తారు’’ అని ట్విట్టర్ ద్వారా ఈ చిత్రం వివరాలను చార్మి తెలియజేశారు.