శ్రీరెడ్డిది చీప్‌ పబ్లిసిటీ..

8 Apr, 2018 11:08 IST|Sakshi
సినీ నటి హేమ(పాత చిత్రం)

హైదరాబాద్‌ : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలకు ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరించేందుకు ముందు ఉంటానని సినీ నటి హేమ పేర్కొన్నారు. అలాంటిది తాను ఎందుకు రాలేదని శ్రీరెడ్డి అనడం సబబు కాదన్నారు. శ్రీ రెడ్డి పద్దతి బాగోలేదని, కనీసం అప్లికేషన్ కూడా పూర్తి చేయలేదని వ్యాఖ్యానించారు. ప్రిమెంబర్ షిప్ ఇవ్వమని అడిగిందని తెలిపారు. తెలుగు అమ్మాయిగా తమకు అవకాశాలు రావడం లేదా అని ప్రశ్నించారు.

శ్రీరెడ్డి ప్రవర్తన బాగోలేదని, చీప్‌ పబ్లిసిటీ చేస్తుందని మండిపడ్డారు. ఇలాంటి పనులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇటువంటి పనులు చేస్తే సినిమాల్లోకి ఎవరు వస్తారని అడిగారు. రేపు మా పాపను సినిమాల్లోకి పంపాలి అనుకున్నానని కానీ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయన్నారు. ఇటువంటి ఇండస్ట్రీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు