‘చిత్రలహరి’లోని పాత్రలు మిమ్మల్ని కలుస్తారు!

12 Mar, 2019 10:28 IST|Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఇప్పటికే టైటిల్‌ లోగోను రిలీజ్ చేసిన చిత్రలహరి టీం, ఈ బుధవారం టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ‘‘చిత్రలహరి’లోని పాత్రలో 13వ తారీఖున 9 గంటలకు మిమ్మల్ని కలుస్తారు’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమాతో తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా