‘వెంటిలేటర్‌పై ఉన్నారు.. ఎలాంటి స్పందన లేదు’

7 May, 2020 18:38 IST|Sakshi

ముంబై : సినిమాటోగ్రాఫర్‌ నదీమ్‌ఖాన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన భార్య, గాయని పార్వతి తెలిపారు. ప్రస్తుతం నదీమ్‌ వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె తెలిపారు. నదీమ్‌ ఖాన్‌ సోమవారం సాయంత్రం ఇంట్లో మెట్ల మీద నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో తల, భుజం, ఛాతికి దెబ్బలు తగలడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం అతనికి బ్రెయిన్‌ సర్జరీ నిర్వహించారు. కాగా నదీమ్‌ ఖాన్‌ ప్రముఖ హిందీ కథారచయిత  రాహి మసూమ్‌ రాజా కుమారుడు. నదీమ్‌ ఖాన్‌ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య మాట్లాడుతూ.. ‘ఆయన ఐసీయులో వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను స్పృహలో లేరు. ఆయన స్పందించడానికి 48 నుంచి 72 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. అతను ఎప్పుడు స్పందిస్తారని వేచి చూస్తున్నాం. నదీమ్ ‌నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు’. అని పార్వతి తెలిపారు. (‘అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నా’)

‘మేము ఆస్పత్రికి వచ్చినప్పుడు నదీమ్‌కు చిన్న చిన్న గాయలు మాత్రమే అయ్యాయి. అయితే ఇప్పుడవి సీరియస్‌గా మారాయి. ఆసుపత్రిలో అతన్ని ఐసీయూలో కోవిడ్‌-19 బాధితులతో ఉంచారు. రెండు నెలలుగా అతను లాక్‌డౌన్‌లోనే ఉన్నారు. ఎవరినీ కలవలేదు. వైద్యులు నదీమ్‌కు ర్యాపిడ్‌ పరీక్షలు, అత్యవసర సర్జరీలు చేశారు. అయితే ఈ ప్రక్రియను నిర్వహించడంలో వైద్యులు ఆలస్యం చేశారు. ఆసుపత్రిలో కరోనా ప్రభావం ఉండటం వల్ల ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. కేవలం అతను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పార్వతి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా నదీమ్‌ ఖాన్‌.. డిస్కో డాన్సర్, జమానా, ఆంధీ-తూఫాన్, ఆగ్ హాయ్ ఆగ్, కింగ్ అంకుల్, గునాహ్ వంటి 40 చిత్రాలకు పైగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే చంకీ పాండే, ఇందర్ కుమార్, మోనికా బేడి నటించిన తిర్చి తోపివాలే (1998) సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. (రియాజ్‌..ఇక నరకంలో హాయిగా నిద్రపో’ )

మరిన్ని వార్తలు