Bigg Boss 7 Day 69 Highlights: శివాజీ నీకు హెడ్ వెయిట్ పెరిగింది.. నాగ్ షాకింగ్ కామెంట్స్

11 Nov, 2023 23:07 IST|Sakshi

బిగ్‌బాస్ షోలో మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున.. స్మూత్‌గా కౌంటర్స్ వేశాడు. శివాజీ విషయంలో మాత్రం ఎప్పటిలానే మెతకగా ప్రవర్తించాడు. కాకపోతే తిట్టడానికి బదులు బతిమాలాడుకోవడం కాస్త వింతగా, విచిత్రంగా అనిపించింది. రతిక గురించి హౌస్‌మేట్స్ అందరూ ఓ నిజాన్ని బయటపెట్టారు. ఇంతకీ శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 69 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

సీరియల్ బ్యాచ్ మధ్య గొడవ
కెప్టెన్సీ రేసులో చివరకు శివాజీ, అర్జున్ మిగలడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. ఫ్రెండ్స్ అనుకున్నవాళ్లే తన బొమ్మని తీసుకెళ్లలేదని అమరదీప్ తెగ బాధపడిపోయాడు. ఘోరంగా హర్ట్ అయ్యాడు. ఇదే విషయాన్ని సీరియల్ బ్యాచ్ దగ్గర చెప్పాడు. ఈ క్రమంలోనే శోభా-అమర్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇది జరిగిన కాసేపటికి శివాజీతో మాట్లాడుతూ.. మీరు-ప్రియాంక ముందే ఫిక్స్ చేసుకున్నారని రతిక అనేసింది. అంతే.. 'గేమ్ ఆడవ్ నువ్వు, మిగతావన్నీ ఆలోచిస్తుంటావ్' అని రతికపై శివాజీ సీరియస్ అయిపోయాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!)

శివాజీకి హెడ్ వెయిట్
ఈ వారం కొత్త కెప్టెన్ శివాజీ అయ్యాడు. అయితే ఫిజికల్ టాస్క్ పెడితే అర్జున్‌పై గెలిచి శివాజీ కెప్టెన్ కావడం అసాధ్యం. దీంతో బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ చాలా తెలివిగా ఆలోచించి, హౌస్‌మేట్స్ అందరినీ సీక్రెట్ రూంకి పిలిపించి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని నాగార్జునతో అడిగించారు. ఒక్కరు కూడా మరోమాట లేకుండా శివాజీ పేరు చెప్పారు. షో నిర్వహకులు ప్లాన్ చేసినట్లు శివాజీ కెప్టెన్ అయిపోయాడు. అయితే శివాజీకి బాగా హెడ్ వెయిట్ పెరిగిపోయిందని, అతడితో మాట్లాడుతూ నాగార్జున అన్నాడు. 

బతిమాలుకున్న నాగార్జున
ఎవరు తప్పు చేసినా గట్టిగా నిలదీసి బెదిరించే హోస్ట్ నాగార్జున.. శివాజీ విషయంలో శీతకన్ను ప్రదర్శిస్తుంటారు. మంచోడి అని ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు అదే చేశారు. నామినేషన్స్ సందర్భంగా శివాజీ రాజమాతల్ని ఉద్దేశిస్తూ.. 'రాజమాతలు మీ మూతలు పగుల్తాయ్'  అన్న వీడియోని నాగ్ ప్లే చేశాడు. దీని గురించి క్లారిటీ ఇవ్వమని శివాజీని అడిగాడు. ఇక సోఫాజి.. సినిమా యాక్టింగ్ నాగ్ ముందు చేసేసి.. 'అదంతా సరదాకి అన్నాను' అని కవర్ చేశాడు.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే?)

దీంతో శివాజీ తీరుపై నాగ్ బుద్ధి చెప్పాల్సింది పోయి, బతిమలాడుకున్నాడు. 'క్యాజువల్‌గా నువ్వు అనే మాటల్ని జనాలు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశముంది. కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరముంది. నువ్వు సరదాగా అనే మాటల మూలాన కొందరి మనోభావాలు దెబ్బతినొచ్చు, దెబ్బతింటాయి కూడా. చూస్కో, నోరు కంట్రోల్‌లో పెట్టుకో.. అందుకే వీడియో చూపించాను' అని నాగార్జున  అన్నాడు. అయితే ఈ సంభాషణ అంతా కూడా బిగ్‌బాస్ హౌస్‌మేట్‌కి చెబుతున్నట్లు కాకుండా అలా చేయొద్దురా అని ఫ్రెండ్‌తో బతిమాలాడుకున్నట్లు అనిపించింది. ఇదంతా చూస్తే శివాజీకి హౌస్ట్ నాగార్జున ఫేవర్ అంతా బట్టబయలైంది.

రతిక ఎలిమినేషన్ టెన్షన్
ఇక రతికని వీకెండ్ ఎపిసోడ్ లో చూసిన నాగార్జున్.. ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్? అని అడిగాడు. 'అంత టెన్షన్‌లో వద్దు, ఎప్పుడు కొంచెం టెన్షన్‌లో ఉంటావ్.. వద్దు వద్దు' అని నాగార్జున అన్నాడు. దీంతో రతిక.. 'హౌసులో ఉండాలని ఉంది సర్ అందుకే ఇలా' అని చెప్పుకొచ్చింది. 'ఉండాలి అంటే నువ్వు ఆడాలి అంతే, సింపుల్ ఫార్ములా' అని నాగ్ చెప్పాడు. దీంతో రతిక.. ఎలిమినేషన్ భయం బయటపడింది. ఇకపోతే ఈ వారం పాస్-ఫెయిల్ అని చిన్న గేమ్ పెట్టగా.. ఇంటి సభ్యులందరూ కూడా రతిక పూర్తిగా ఫెయిలైందని ఓటేశారు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: పదో వారం ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌!)

మరిన్ని వార్తలు