దర్శకుడిగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు

14 May, 2018 08:43 IST|Sakshi

తమిళసినిమా: సినిమాకు ఛాయాగ్రహకుడు అర్ధ దర్శకుడు అనవచ్చు. దర్శకుడి భావాలను తెరపై అందంగా, అర్ధవంతంగా ఆవిష్కరించేది ఛాయాగ్రహకుడే. అందుకే చాలా మంది ఛాయాగ్రహకులు మోగాఫోన్‌ పట్టి సక్సెస్‌ అవుతున్నారు.ఆ కోవలోకి సీనియర్‌ ఛాయాగ్రహకుడు కబీర్‌లాల్‌ చేరబోతున్నారు. కబీర్‌ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలకు ఛాయాగ్రహణం  అందించి ప్రసిద్ధికెక్కారు. హిందిలో పరదేశ్, అప్నే, వెల్‌కమ్‌బ్యాక్, తమిళంలో కమలహాసన్‌ నటించిన మైఖెల్‌ మదనకామరాజ్, తెలుగులో ఆధిత్య 369, భైరవదీపం, అందరివాడు వంటి చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పనిచేసి అందరి మన్ననలు పొందాడు.మొత్తం 100 చిత్రాలకు పైగా ఛాయాగ్రహకుడిగా పనిచేసిన కబీర్‌ ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాక ముందు మైఖెల్‌ మదన కామరాజ్‌ చిత్రంలో ఒకే ఫేమ్‌లో కమలహాసన్‌ను చూపిన విధానంపై ప్రశంసలు అందుకున్నాడు.

కాగా స్పానీష్‌ భాషలో తెరకెక్కి ఐరోపా దేశాలలో సంచలన విజయం సాధించిన చిత్రం జూలియాస్‌ ఐస్‌. ఒక్క స్పెయిన్‌ దేశంలోనే సుమారు 20 మిలియన్‌ డాలర్లను వసూల్‌ చేసిన ఈ చిత్రాన్ని కబీర్‌ తమిళం,తెలుగు భాషల్లో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ జూలియాస్‌ ఐస్‌ వైవిధ్యంతో కూడిన సినిమా అని పేర్కొన్నారు.ఆ చిత్రాన్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలని భావించానన్నారు. ముందుగా తమిళం,తెలుగు భాషలలో తెరకెక్కించి ఆ తరువాత ఇతర భాషల్లో రీమేక తలపెట్టామన్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభిచనున్నట్లు చెప్పారు. జూలియా అనే ఒక యువతి తన సోదరుడి మరణానికి కారణం ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో తన చూపును కోల్పోతుంది. ఆ తరువాత ఏం జరిగిందన్న సంఘటనల ఇతి వృత్తమే జూలియాస్‌ ఐస్‌ చిత్రం అని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు