‘గీతాంజలి’ని మించి...

6 Apr, 2015 23:59 IST|Sakshi
‘గీతాంజలి’ని మించి...

‘కలర్స్’ స్వాతి ఇక నుంచి ‘త్రిపుర’గా మారనున్నారు. అదేంటి అనుకుంటున్నారా...! ఆమె  ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘త్రిపుర’. ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశే ఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజ్ కిరణ్ దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు బోయపాటి శ్రీను, అలీ, కోనవెంకట్ కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాజ్‌కిరణ్‌కు అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘మళ్లీ కోనవెంకట్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ‘గీతాంజలి’ ని మించిన చిత్రం అవుతుంది ’’ అని చెప్పారు. కథ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యానని, రాజ్ కిరణ్ ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉందని కోనవెంకట్ తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని, ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే : కోనవెంకట్, కెమెరా: రవికుమార్, సంగీతం: కామ్రాన్.