కమర్షియల్ చిత్రంగా మున్నోడి

26 Oct, 2016 01:46 IST|Sakshi
కమర్షియల్ చిత్రంగా మున్నోడి

మనిషి ఎదగడానికి స్ఫూర్తి కావాలని చెప్పే చిత్రం మున్నోడి అని తెలిపారు ఆ చిత్ర దర్శక నిర్మాత ఎస్‌పీటీఏ.కుమార్. ఇప్పుడు సినిమాపై ప్రేమ ఉంటే చాలు. అదే సినిమాను తీయిస్తుంది. ఈ చిత్ర దర్శకుడిది అలాంటి ప్రేమే. ఎవరి వద్దా శిష్యరికం చేయకుండానే మున్నోడి చిత్రానికి మోగాఫోన్ పట్టారు. తెన్‌కాశీకి చెందిన వ్యాపారవేత్త అయిన ఎస్‌పీటీఏ.కుమార్ స్వీయ దర్శకత్వంలో సోహం అగర్వాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ఇది. టాలీవుడ్ వర్ధమాన జంట హరీష్, యామినీభాష్కర్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తున్నారు.
 
ముఖ్య పాత్రలో తల్లిగా సితార చాలా కాలం తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం మున్నోడి. వినోద్త్న్రసామి చాయాగ్రహణ ం, ప్రభుశంకర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ప్రేమ,యాక్షన్,సెంటిమెంట్, హాస్యం అంటూ అన్ని అంశాలూ కలిగిన జనరంజక పూర్తి కమర్శియల్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. మనం తీసుకునే స్ఫూర్తిని బట్టే జీవితపయనం ఉంటుంది. బాంధవ్యాల విలువలు చెప్పే చిత్రం మున్నోడి అని తెలిపారు. ఇప్పటికీ 95 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యిందన్నారు. ఇందులో నాలుగు పాటలతో పాటు రెండు బిట్ సాంగ్స్ ఉంటాయని చెప్పారు.
 
అందులో ఒక పాటను పూర్తిగా గ్రాఫిక్స్‌లో రూపొందించామని అందుకు మాత్రమే ఆరు నెలలు పట్టిందని తెలిపారు. హీరోహీరోయిన్లు తెలుగు వారు అయినా సన్నివేశాలను అర్థం చేసుకుని చక్కగా నటిస్తున్నారని, ముందుగా వారితో రిహార్సల్స్ చేయించినట్లు తెలిపారు.త్వరలో చిత్ర ఆడియోను విడుదల చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది యూనివర్సల్ కథా చిత్రం అని, అందువల్ల తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు.