కొత్త దళపతి

27 Oct, 2017 00:48 IST|Sakshi

రజనీకాంత్‌–మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘దళపతి’ తెలుగు, తమిళ భాషల్లో ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. పాతికేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అసలు విషయానికొస్తే... సదా, కవితా అగర్వాల్‌ జంటగా ‘దళపతి’ పేరుతో తాజాగా ఓ సినిమా రూపొందింది. సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

సదా మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సదా ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. యాజమాన్య సంగీతం అందించిన పాటలకు, ముఖ్యంగా శ్రేయాఘోషల్‌ పాటకు అనూహ్య స్పందన వచ్చింది. రజనీకాంత్‌ ‘దళపతి’లా మా సినిమా కూడా హిట్టవుతుంది. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు