రౌడీ క్రేజ్‌: యూట్యూబ్‌లో ఒక్క రోజులోనే..

21 Jan, 2020 11:25 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ.. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. గీతాగోవిందంతో సైలెంట్ అబ్బాయిలా, అర్జున్‌ రెడ్డితో వయొలెంట్‌లా రెచ్చిపోయిన ఈ హీరో ఏ పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఇతనికి టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌‌లోనూ అభిమానులు పుష్కలంగా ఉన్నారు. కాగా రౌడీ స్టార్‌ విజయ్‌ గతేడాది నటించిన డియర్‌ కామ్రేడ్‌ తెలుగులో ఘోరంగా విఫలమైంది. కానీ దీనికి భిన్నంగా హిందీలో మాత్రం ఈ సినిమా ఫెయిల్‌ కాలేదు. తెలుగులో చతికిలపడ్డ ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌ ఎంతగానో ఆదరిస్తున్నారు.

డియర్‌ కామ్రేడ్‌ హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా కేవలం ఒక్క రోజులోనే 12 మిలియన్ల వ్యూస్‌ సాధించి సంచలనం సృష్టిస్తోంది. హిందీ ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందని రౌడీ నటనను కొనియాడుతున్నారు. నూతన దర్శకుడు భరత్‌ కమ్మ​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవి శంకర్, యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో విజయ్‌ సరసన రష్మిక మందన్నా నటించిన విషయం తెలిసిందే.

చదవండి:

రౌడీ.. ఫైటింగ్‌ షురూ

ఫైటర్‌కు జోడి?

రౌడీ ఫ్యాన్స్‌కు లవ్‌సాంగ్‌ గిఫ్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా