నాకు మైసూర్‌ పాక్‌ తీసుకురా: బాలీవుడ్‌ నటి

26 Jan, 2020 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ పాపులర్‌ కపుల్స్‌ రన్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొనె ఎప్పటికప్పుడు తమ వృత్తి, వ్యక్తిగత వియాలను సోషల్‌మీడియాలో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ సినిమాలకు సంబంధించిన ఫోటోలు, సినిమా ప్రచార విషయాలను అభిమానులతో తరచు పంచుకుంటారు. రన్‌వీర్‌సింగ్‌ తాను నటించిన ‘83’ సినిమా ప్రచారం కోసం చెన్నై వెళ్లినట్లు ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ఈ ఫోటోలో అలనాటి ప్రపంచకప్‌ సాధించిన భారత్‌ జట్టులోని క్రీడాకారులుగా నటించిన నటులు ఉన్నారు. కాగా, దీనిపై రన్‌వీర్‌ భార్య దీపికా పదుకొనె స్పందిస్తూ.. ‘చైన్నై నుంచి కిలో మైసూర్‌పాక్‌, రెండున్నర కిలోల ఆలు చిప్స్‌ తీసుకురండి. అవి తీసుకురాకుండా తిరిగి రావద్దు’ అని సరదాగా కామెంట్‌ చేశారు. దీంతోపాటు ఈ సినిమా దర్శకుడు కబీర్‌సింగ్‌ భార్య కూడా తన భర్తకు అచ్చం దీపికా చెప్పిన తరహాలోనే మైసూర్‌ పాక్‌, ఆలు చిప్స్‌ తీసుకురావాలని కామెంట్‌ చేశారు.
చదవండి: శ్రీకాంత్‌గా నటించడం ఓ వరం

KAPIL’S DEVILS STORM CHENNAI !!! 😈🏏🏆 @83thefilm @kabirkhankk @pankajtripathi @tahirrajbhasin @actorjiiva @saqibsaleem @thejatinsarna @iamchiragpatil @dinkersharmaa @nishantdahhiya @harrdysandhu @issahilkhattar @ammyvirk @adinathkothare @dhairya275 @rbadree #ThisIs83

A post shared by Ranveer Singh (@ranveersingh) on

అదేవిధంగా రన్‌వీర్‌సింగ్‌ మరోఫోటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 1983 నాటి ప్రపంచకప్‌ జట్టు, ప్రస్తుతం అచ్చం అలానే సినిమాలో నటిస్తున్న నటులు ఉన్న ఫోటో అది. రన్‌వీర్‌ పోస్ట్‌ చేసిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

1983 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమిండియా శక్తివంతమైన వెస్టిండీస్‌పై గెలిచి భారత్‌కు మొదటి ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టిన విషయం విదితమే. ఆ సమయంలో మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ టీమిండియాకు సారథ్యం వహించి భారత్‌కు అత్యంత ఘనవిజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో కపిల్‌ సారథ్యంలో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచిన ఇతివృత్తంలో ఈ సినిమాను దర్శకుడు కబీర్‌ సింగ్‌ తెరకెక్కించారు. ఇందులో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించగా, రణ్‌వీర్‌ భార్య, బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొన్‌ కపిల్‌ భార్య రోమీ పాత్రలో కనిపిస్తారు. కాగా, ఈ  చిత్రం ఎప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందకు రానున్నట్టు తెలుస్తోంది.
 

#ThisIs83 @kabirkhankk @deepikapadukone @sarkarshibasish #SajidNadiadwala @vishnuinduri @ipritamofficial @reliance.entertainment @fuhsephantom @nadiadwalagrandson @vibrimedia @zeemusiccompany @pvrpictures @83thefilm . @pankajtripathi @tahirrajbhasin @actorjiiva @saqibsaleem @thejatinsarna @iamchiragpatil @dinkersharmaa @nishantdahhiya @harrdysandhu @issahilkhattar @ammyvirk @adinathkothare @dhairya275 @rbadree

A post shared by Ranveer Singh (@ranveersingh) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

ఆశ్చర్య పరుస్తున్న బామ్మ ఫిట్‌నెస్‌!

పెద్ద మనసు చాటుకున్న నయనతార

వైరస్‌ గురించి ముందే ఊహించా

ఏడాది జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌

సినిమా

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

పెద్ద మనసు చాటుకున్న నయనతార

వైరస్‌ గురించి ముందే ఊహించా

కరోనా పాజిటివ్‌.. 10 లక్షల డాలర్ల విరాళం!

ఏడాది జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌