అతను టోటల్‌గా ‘నా వాడు’ అయిపోవాలి!

31 Jan, 2016 23:32 IST|Sakshi
అతను టోటల్‌గా ‘నా వాడు’ అయిపోవాలి!

ప్రేమ గురించి చెప్పమంటే ఎంతసేపైనా ఓపికగా చెప్పేట్లు ఉన్నారు దీపికా పదుకొనె.
రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడి, అతన్నుంచి విడిపోయాక రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడ్డారీ బ్యూటీ.
సో.. ప్రేమకు సంబంధించి రెండు అనుభవాలు ఉన్నాయి ఆమెకు.
ప్రేమ-పెళ్లి గురించి దీపికాకు కొన్ని అభిప్రాయలున్నాయి.
వాటి గురించి ఈ  బ్యూటీ ఏమంటున్నారో తెలుసుకుందాం...

 
1.
చాలామంది ప్రేమకు డెఫినిషన్ చెప్పవా? అని నన్ను పలు సందర్భాల్లో అడిగారు. అసలు లవ్‌కి డెఫినిషన్ ఉంటుందా? ఒకవేళ ఉంటే దానికి కూడా ప్రేమంటే ఏంటో తెలీదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రేమ ఇలా ఉంటుంది అని విశ్లేషించలేం. ఒక్క మాటలో, ఒక్క పదంలో ప్రేమను నిర్వచించడం చాలా కష్టం. ప్రేమ అంటే ఓ ఫీలింగ్ కాదు. ఒక  ఎమోషన్. ఎవరి మీదా ఇష్టం ఒక్కసారిగా పుట్టదు. ఏ ఇద్దరి మధ్య అయినా రోజులు గడిచే కొద్దీ ప్రేమ బలపడుతుంది. ఏ బంధం అయినా నిలబడాలంటే  నిజాయతీ, నమ్మకం, ఒకరి మీద ఒకరికి కేరింగ్ ఇవన్నీ కచ్చితంగా ఉండాలి.
 
2.
ఇప్పటివరకూ జీవితంలో పలు విషయాల్లో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నాను. అలాంటివి మళ్లీ రిపీట్ కాకూడదన్నదే నా ప్రయత్నం. ప్రేమలో ఎదురైన చేదు అనుభవం ఇక ఎప్పటికీ ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.  ఒకసారి తప్పు జరిగిపోయింది.  
 
3.
ఒక వేళ నన్ను ప్రేమిస్తూ ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించాడంటే  నేను సహించలేను. ఒక వ్యక్తి మనతో జీవితాన్ని పంచుకుంటున్నాడంటే అతని ప్రేమ పూర్తిగా మనకే సొంతం కావాలి. టోటల్‌గా ‘నా వాడు’  అయిపోవాలి. అతని సర్వస్వం నే నే కావాలి. ఏదైనా తేడా వస్తే ఫైట్ చేయడానికైనా రెడీ. అంతే గానీ చూస్తూ మాత్రం ఊరుకోను.
 
4.
నేను సహజీవనం చేస్తానని, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చాలా మంది వార్తలు పుట్టిస్తున్నారు. అసలు అలాంటివి ఎందుకొస్తున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. నాకు నచ్చితే పెళ్లి చే సుకుంటానే గానీ సహజీవనం మాత్రం చేయను. ఇలా అంటున్నానని నేను సహజీవనానికి వ్యతిరేకిని అనుకోవద్దు. అన్ని రకాల బంధాలను గౌరవిస్తాను. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జడ్జ్ చేయడానికి మనం ఎవరం? అని నేననుకుంటాను. నేను సామాజికంగా ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా  నా మూలాలను మర్చిపోలేను. అందుకే సహజీవనం చేయకూడదని నేను అనుకుంటున్నా.
 
5.
లవ్ మ్యారేజ్, ఎరేంజ్డ్ ఏదైనా కావచ్చు... జీవితాంతం ఆ బంధం నిలబడాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన ముఖ్యం. నా వైవాహిక జీవితం మాత్రం చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లప్పుడు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ప్రామిస్ చేసుకుంటాం. ఆ ప్రామిస్‌ని కాపాడుకుంటాను. అవసరమైతే నటనకు గుడ్‌బై చెప్పేసి మరీ నా పర్శనల్ లైఫ్‌ను ఆస్వాదిస్తాను.