కంటెంట్‌ని నమ్మి ఇంత దూరం వచ్చాం

25 Jun, 2018 01:33 IST|Sakshi
దిల్‌ రాజు, శిరీష్, రాజ్‌ తరుణ్, రిషీ రిచ్, అనీష్‌ కృష్ణ, రిద్ధి కుమార్, హర్షిత్, సాయి కార్తీక్‌

‘‘ఆరు బంతులకి ఆరు సిక్స్‌ (వరుసగా 6 చిత్రాల హిట్స్‌ని ఉద్దేశించి)లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ తర్వాతి బాల్‌కి ఎలా నెర్వస్‌గా ఫీల్‌ అవుతాడో నా పరిస్థితి అలా ఉంది. ‘అలా ఎలా’ సినిమాని ఫ్యామిలీ అంతా కలసి బాగా ఎంజాయ్‌ చేశాం. ఈ సినిమాని కూడా ‘అలా ఎలా’లానే ఎంటర్‌టైనింగ్‌ వేలో చేశాడు అనీష్‌’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. రాజ్‌ తరుణ్, రిద్ధి కుమార్‌ జంటగా నటించిన చిత్రం ‘లవర్‌’. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ హైదరాబాద్‌లో జరిగింది.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘సోలోగా సినిమా చేస్తాను.. నన్ను నేను ప్రూవ్‌ చేసుకుంటాను అని హర్షిత్‌ (‘దిల్‌’ రాజు అన్న కొడుకు) అనడం మొదలుపెట్టాడు. ఇన్నేళ్లుగా శిరీష్, నేను ట్రావెల్‌ అవుతున్నాం. కంటెంట్‌ని నమ్మి ఇంత దూరం వచ్చాం. నేను బిగినింగ్‌ డేస్‌లో ఏం చేశానో హర్షిత్‌ అలానే చేశాడు. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. గతేడాది నుంచి మాకు వస్తున్న సక్సెస్‌లు ఆగకూడదు. తనకి తొలి సక్సెస్‌ రావాలి. రాజ్‌ తరుణ్‌ ఫ్లాప్‌లో ఉన్నా ఫస్ట్‌ లుక్‌ ట్రెండ్‌ అయిందంటే మా బ్యానర్‌కి ఉన్న వేల్యూ అది.

రాజ్‌కి సరిపోయే కథలున్న ప్రతిసారీ మేం తనతో సినిమాలు చేస్తాం’’ అన్నారు. రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్‌ సినిమాలాగే భావించి ఈ సినిమా చేశాను. నా లుక్‌ మారడానికి హర్షిత్‌ కారణం. నా గురించి నాకన్నా ఎక్కువ కేర్‌ తీసుకున్నారు. నన్ను భరించి ఈ సినిమా తీసినందుకు అనీష్‌కి థ్యాంక్స్‌. సినిమా చాలా బాగా తీశాడు. సంగీత దర్శకులందరూ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. రాజుగారు నాతో ఏడాదికి ఓ సినిమా చేస్తానని మాటిస్తే ఇంకే సినిమాలు ఒప్పుకోను’’ అన్నారు. హర్షిత్‌ మాట్లాడుతూ – ‘‘మాములుగా అబ్బాయి సినిమాల్లోకి వస్తానంటే తల్లిదండ్రులు ఇన్వెస్ట్‌ చేస్తారు.

నన్ను నమ్మి నా బాబాయ్‌లు 10 కోట్లు దాకా ఖర్చు  పెట్టారు. టోటల్‌ టీమ్‌ అంతా కష్టపడి పని చేశారు’’ అన్నారు. ‘‘రాజు, శిరీష్‌గార్లు సినిమా చూసే కంటే ముందు హర్షిత్‌ నా సినిమాలు ఎడిట్‌ టేబుల్‌ మీద చూసేవాడు. తనకి మంచి జడ్జిమెంట్‌ ఉంది’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘‘లాస్ట్‌ ఇయర్‌ ఈ బేనర్లో రిలీజైన ఫస్ట్‌ సినిమా ‘శతమానం భవతి’, ఈ ఇయర్‌ ‘లవర్‌’ రిలీజవుతోంది. ఇది కూడా సక్సెస్‌ కావాలి’’ అన్నారు సతీష్‌ వేగేశ్న. ‘‘అలా ఎలా’ చూసి, సినిమా చేద్దాం అన్నారు రాజుగారు. 20 నిమిషాలు కథ విని ఓకే అన్నారు. ‘60 శాతం మందికి నచ్చితే చాలని నువ్వు చేశావు. దాన్ని 100 శాతం మందికి రీచ్‌ అయ్యేలా చేస్తాను’ అని రాజుగారు అన్నారు’’ అని చెప్పారు అనీష్‌.

మరిన్ని వార్తలు