ప్రియుడు ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తే బ్రేకప్‌ చెప్పింది.. ట్విస్ట్‌ ఇదే!

5 Nov, 2023 08:12 IST|Sakshi

తాజాగా ఇంటర్నెట్‌లో ఒక విచిత్ర ఉదంతం వైరల్‌గా మారింది. ఇటువంటి విషయాన్ని ఎవరూ ఎప్పుడూ వినివుండరు. ఒక యువకుడు తన ప్రియురాలికి  ఆమె పుట్టినరోజు సందర్భంగా అత్యంత ఖరీదైన క్రూయిజ్ టికెట్ ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయి ఆనందంతో ఎగిరి గంతులేసేందుకు బదులు, ఆగ్రహంతో అతనికి బ్రేకప్‌ చెప్పింది. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒక యువతి ఇటీవల తాను తన ప్రియుడి నుంచి విడిపోయానని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ యువతి పోస్ట్‌లో ఇలా రాసింది.. ‘సముద్రాన్ని చూసినప్పుడు నాకు అనారోగ్యం వస్తుందని తెలిసి కూడా ఎందుకు నా కోసం క్రూయిజ్ టిక్కెట్ కొన్నావని నేను అతనిని అడిగాను. నేను కొన్ని నెలలుగా రెయిన్‌ఫేర్ ఫెస్టివల్‌ కోసం సిద్ధమవుతున్నానని కూడా అతనికి తెలుసు. తనకు క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నాతో చెప్పాడు. నాకు క్రూయిజ్‌ టిక్కెట్‌ కొన్నాడని తెలిశాక అతను ఎంత నీచమైనవాడో నేను గ్రహించాను. నా పుట్టినరోజున నేను ఎంత అనారోగ్యానికి గురైనా అతనికి అవసరం లేదు. అతనికి క్రూయిజ్‌ ‍ప్రయాణం ఇష్టమని నేను కూడా అతనితో రావాలని అతను కోరుకున్నాడు. ఇది నాకు నచ్చక అతని నుంచి విడిపోయాను. అయితే నేను చెప్పిన  బ్రేకప్‌ను అతను అంగీకరించడం లేదు. కొద్ది రోజుల్లో విబేధాలు సమసిపోతాయి’ అని ఆమె పేర్కొంది. 

ఆ యువతి రెడ్డిట్‌లో u/Helpful-Minimum8496 అనే ఖాతాతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది వేగంగా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది ఆ యువతి అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. అలాగే తమ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేశారు. ఒక యూజర్‌ ఇలా రాశాడు..‘ఆ యువకుడు ఆమె ఆరోగ్యాన్ని గుర్తించి ఉంటే ఇలా జరిగేదికాదు. ఆ కుర్రాడి తీరు నీచమనిపిస్తోంది’ అని రాశారు. మరొక యూజర్‌ ఇలా రాశారు.. ‘అతను మీ అభిరుచులను పట్టించుకోకుండా, తన కోరికలకే  ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే మీరు అతనిని వదిలివేయడం ఉత్తమం’ అని రాశారు.
ఇది కూడా చదవండి: ‘గ్రాప్‌- 3’ అంటే ఏమిటి? ‍ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?

మరిన్ని వార్తలు