హీరోయిన్లే హీరోలు

5 Mar, 2020 00:24 IST|Sakshi
బాలు అడుసుమల్లి

‘‘చీరాలలో బీ టెక్‌ చదువుకొని సినిమా మీద ఉన్న పిచ్చితో హైదరాబాద్‌ వచ్చాను. కొంతకాలం మీడియాలో పని చేసిన తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’  సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు బాలు అడుసుమల్లి. ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ముఖ్య తారలు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్, పూరీ పిక్చర్స్‌ పతాకంపై  బాలు అడుసుమల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మించిన ‘అనుకున్నది ఒక్కటి...’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌ విత్‌ హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం. నలుగురు హీరోలు గోవా వెళ్లి ఎంజాయ్‌ చేసే సినిమాలు చాలా వచ్చాయి.

నాకు హీరోలతో సినిమా చేయలని ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం రావటం చాలా కష్టం. అందుకే నా కథకు అమ్మాయిలే హీరోలు అనుకొని సినిమా తీయటానికి రెడీ అయ్యాను. కథ విషయానికొస్తే నలుగురు అమ్మాయిలు మందుకొట్టి మగాళ్ల గురించి ఏం మాట్లాడుకుంటారు? ఓ ఫ్రెండ్‌  డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు గోవా వెళ్లిన నలుగురమ్మాయిలు అనుకోకుండా ఓ హత్య చేసి హైదరాబాద్‌కి వస్తారు. వచ్చాక ఎవరి పనులు వారు చేసుకుంటుంటారు. ఆ టైమ్‌లో విలన్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. ఆ బ్లాక్‌మెయిల్‌ నుండి తప్పించుకోవటానికి మళ్లీ గోవా వెళ్తారు. అలా వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏంటి? అనేది మా సినిమా కథ. ఇది నిజంగా జరిగిన కథ. నా ఫ్రెండ్స్‌కే ఇలా జరిగింది. వాళ్లు చెప్పిన కథను దృష్టిలో పెట్టుకొని ఈ కథను సినిమాగా ఎందుకు తీయకూడదని తీశాను. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు