పరువు హత్యల కళిరు

24 Sep, 2017 04:21 IST|Sakshi

తమిళసినిమా: పరువు హత్యలు ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం కళిరు అని ఆ చిత్ర దర్శకుడు జీజే.సత్య తెలిపారు. సీబీఎస్‌.ఫిలింస్, అప్పు స్టూడియోస్‌ సంస్థల అధినేతలు పి.విశ్వక్, ఏ.ఇనియవన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూతన నటీనటులు నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పరువు హత్యల ప్రధాన ఇతివృత్తంగా రూపొందించిన చిత్రం అని తెలిపారు. కళిరు అంటే మగ ఏనుగు అనే అర్థం వస్తుందన్నారు.

ఏనుగు యుద్ధంలో గాయాలకు గురైతే ఆత్మరక్షణ కోసం మొరటుతనంగా ప్రవర్తిస్తుందన్నారు. కొందరు రాజకీయనాయకులు తమ అధికార దాహం కోసం ఎలాంటి దురాగతాలౖకైనా పాల్పడతారని చెప్పే చిత్రంగా కళిరు ఉంటుందన్నారు. ప్రజల్ని భావోద్రేకాలకు గురి చేసి ఊరంతా ముప్పునకు గురైయ్యేలా చేసే రాజకీయవాదుల నైజాన్ని చెప్పే చిత్రం ఇదన్నారు అలా పరువు హత్యల ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.

ఇది సమాజంలో జరుగుతున్న సంఘటనలను సహజత్వానికి దగ్గరగా ఉండాలన్న భావంతో నూతన తారలతో రూపొందించామని చెప్పారు. విశ్వక్, అనుకృష్ణ, నీరజ, దీపాజయన్, శివకేశన్, దురైసుధాకర్, జీవా, ఉమాశంకర్, టీపొట్టిగణేశ్, కాదల్‌ అరుణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర షూటింగ్‌ను 58 రోజుల్లో పూర్తి చేశామన్నారు. చిత్ర గీతాలను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు

మరిన్ని వార్తలు