అవినీతిపై పోరాటం

28 Dec, 2019 00:52 IST|Sakshi
సత్య సుమన్‌బాబు

సి.హెచ్‌. సత్య సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం 2గా ఓ సినిమా రూపొందనుంది. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఎర్రచీర’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. బేబీ డమరి సమర్పణలో రూపొందనున్న కొత్త చిత్రం జనవరి 27న ప్రారంభం కానుంది.  ఈ సందర్భంగా సత్య సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఒక ఐ.ఏ.ఎస్‌. అధికారి రాజీలేని పోరాటం చేసి అవినీతిని ఎలా అంతమొందించారన్నదే మా సినిమా కథ. సమాజానికి మంచి సందేశాత్మక చిత్రమిది. జనవరి 27 నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా