నా కెరీర్‌ అయిపోలేదు

28 Dec, 2019 00:32 IST|Sakshi
నిత్యామీనన్‌

సౌత్‌లో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న నిత్యామీనన్‌ పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఈ ఏడాది ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చారు. నటిగా ఇప్పటివరకూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే జాతీయ అవార్డు మాత్రం పొందలేకపోయారు. ఈ విషయం గురించి నిత్యామీనన్‌ మాట్లాడుతూ – ‘‘ఒక నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేక్షకులు మెచ్చిన మంచి సినిమాలో నేను భాగమై, అందులో నా నటనకు జాతీయ అవార్డు రావాలనుకుంటున్నాను.

నాకు జాతీయ అవార్డు తెచ్చే సినిమా రొటీన్‌గా ఉండకూడదు. అలాంటి సినిమా అయితేనే చేస్తాను. అయినా నా కెరీర్‌ ఇంకా అయిపోలేదు. చాలా కెరీర్‌ ఉంది కాబట్టి తప్పకుండా ఏదో ఒక సినిమాకి జాతీయ అవార్డు సాధిస్తాననే నమ్మకం ఉంది. నన్ను నేను ఎప్పుడూ ఒక కొత్త హీరోయిన్‌లానే భావిస్తాను. యాక్టర్‌గా ఇక చాలు అని అస్సలు అనుకోను’’ అని పేర్కొన్నారు. ‘మిషన్‌ మంగళ్‌’ తర్వాత వేరే హిందీ చిత్రం కమిట్‌ కాలేదు ఎందుకు? అనడిగితే – ‘‘నాకు నచ్చే కథ కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నారు నిత్యామీనన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా