యాభై.. వందరోజుల వేడుకలు పోయాయి

27 Jan, 2019 02:08 IST|Sakshi
‘దిల్‌’ రాజు, తమన్నా, అనిల్‌ రావిపూడి

– ‘దిల్‌’ రాజు

‘‘ఇప్పటికే మా ‘ఎఫ్‌ 2’ సినిమా 100 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేయడం సంతోషం. ఇంకెంత వసూలు చేస్తుందో మాకు తెలీదు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు నుంచి మరికొన్ని సీన్స్‌ యాడ్‌ చేస్తున్నాం. ప్రేక్షకులు కేరింతలు కొట్టే విధంగా ఈ కొత్త సీన్స్‌ ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్‌ 2’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై 100కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘గతంలో 50 రోజులు, 100 రోజుల వేడుకలుండేవి.

ఇప్పుడు అవన్నీ పోయి 50 కోట్లు, వందకోట్ల గ్రాస్, షేర్స్‌ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అందరికీ మా ‘ఎఫ్‌2’ చిత్రం వంద కోట్ల గ్రాస్‌ షీల్డ్స్‌ని పంపిస్తున్నాం. ఇది మా సినిమాతో స్టార్ట్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వందకోట్ల సినిమా చెయ్యాలన్నది ప్రతి డైరెక్టర్‌ కల. అది ‘ఎఫ్‌2’ తో నాకు దక్కినందుకు హ్యాపీ. ప్రేక్షకులు మరింత ఎంజాయ్‌ చేయడానికి 5 కొత్త సీన్స్‌ని యాడ్‌ చేస్తున్నాం. ఈ చిత్ర విజయంలో చాలామంది కష్టం ఉంది’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘‘దిల్‌’ రాజుగారు రిలీజ్‌ చేసిన ‘హ్యాపీడేస్‌’ సినిమా నాకు టర్నింగ్‌ పాయింట్‌. ఇప్పుడు ‘ఎఫ్‌ 2’ బిగ్గెస్ట్‌ హిట్‌ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లాక్‌ బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు తమన్నా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా