-
వీడియో: మెహ్రీన్‌కు భవ్య బిష్ణోయ్ షాక్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి!
-
‘ఎఫ్ 3’ సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో.. గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను, మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, తొలి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మూవీలోని సెకండ్ సింగిల్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ‘ఊ .. ఆ .. అహ అహ’అంటూ ఈ పాట సాగుతోంది. వెంకటేశ్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంటలపై ఈ పాటను చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రొమో సాంగ్ తమన్నా-మెహరీన్‌లు చీరకట్టులో గ్లామర్‌గా కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాటలో కనిపించనుంది. -
నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’... ‘ఎఫ్ 2’లో మెహరీన్ తన గురించి ఇలా చెప్పుకుంటారు ఇప్పుడు... ‘భవ్య ఈజ్ బెస్ట్’ అంటున్నారు ఎవరీ భవ్య అంటే మెహరీన్ కాబోయే భర్త మార్చి 12న భవ్య – మెహరీన్‌ల నిశ్చితార్థం జరిగింది. పెళ్లెప్పుడు? అంటే... డేట్ ఫిక్స్ కాలేదు. కూల్ కూల్‌గా ‘వింటర్ వెడ్డింగ్’ చేసుకోవాలనుకుంటున్నారు. కాబోయే భర్త గురించి, పెళ్లి విశేషాలను ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మెహరీన్ చెప్పారు. ► జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు.. అవును. ఈ ఫేజ్ చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకు పూర్తిగా ఉన్నాయనిపిస్తోంది. ► హీరోయిన్గా ఆఫర్లు ఉన్నప్పుడు పెళ్లి వాయిదా వేసుకుంటారు చాలామంది. కానీ మీరు అలా అనుకోలేదా? హీరోయిన్గా వచ్చేటప్పుడే మా అమ్మానాన్నతో కెరీర్‌ని, పర్సనల్ లైఫ్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటానని చెప్పాను. 25 లేకపోతే 26 ఏళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానన్నాను. దీన్నే మనసులో పెట్టుకుంటూ, సినిమాలు ఒప్పుకున్నాను. కెరీర్లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఫర్వాలేదు.. అనుకున్న ఏజ్‌కి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి విషయానికీ రైట్ టైమ్ అనేది ఉంటుందని నా ఫీలింగ్. అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం.∙ ► మీది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా? కాదు. ఇది పూర్తిగా అరేంజ్డ్ మ్యారేజే. మా రెండు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా భవ్యా బిష్ణోయ్ కుటుంబంతో మాకు పరిచయం ఏర్పడింది. మా అమ్మగారికి భవ్య నచ్చారు. నాకు తన ప్రొఫైల్‌ని, తనకు నా ప్రొఫైల్‌ని పెద్దవాళ్లు చూపించారు. ఆ తర్వాత మా ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోమన్నారు. అప్పుడు లాక్డౌన్ కావడంతో వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఫోన్లో మాట్లాడుకున్నాం. మెసేజ్‌లు పంపించుకున్నాం. ఫేస్‌టైమ్‌లో మాట్లాడుకునేవాళ్లం. ► ఎవరైనా ముందు కలిసి మాట్లాడుకుని, తర్వాత ‘ఐ లవ్ యు’ చెప్పుకుంటారు. మీరేమో ముందు మాట్లాడుకుని తర్వాత కలిశారన్నమాట... (నవ్వుతూ...) కలిసి మాట్లాడుకుంటేనే కాదు... ఒక్కోసారి ఇలా మాట్లాడుకున్నా ఒకర్నొకరు తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మా మధ్య అండర్స్టాండింగ్ కుదరడానికి లాక్డౌన్ చాలా హెల్ప్ అయ్యిందనుకుంటున్నాను. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన ఆరు రోజులకే నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు భవ్య. ఎందుకంటే నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. ► నిశ్చితార్థం వేడుకలో ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపించారు. మీ ఇద్దరి అభిప్రాయాలు కూడా మ్యాచ్ అయ్యాయా? థ్యాంక్యూ సో మచ్. ఆహారపు అలవాట్ల నుంచి చాలా విషయాల్లో మా ఇష్టాలు, అనిష్టాలు కలిశాయి. మా ఇద్దరి కామన్ ఇంట్రస్ట్స్ కూడా దాదాపు ఒకటే. ► ‘ఎఫ్ 2’లో ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అని మీ గురించి మీరు చెబుతుంటారు. భవ్యలో బెస్ట్ క్వాలిటీస్? చాలా తెలివిగలవాడు. డౌన్ టు ఎర్త్. మర్యాదస్థుడు కూడా! స్కూల్లో టాపర్. చదువులోనే కాదు క్రీడల్లోనూ బెస్ట్. ఢిల్లీలో శ్రీరామ్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ‘ఎల్ఎస్ఇ’ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్)కి వెళ్లారు. మాస్టర్స్ చేయడానికి లండన్ ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్లారు. అకడెమిక్ రికార్డ్ మీద జీ–మ్యాట్ (గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్) రాయకుండానే హార్వర్డ్ కూడా వెళ్లారు. చాలా ట్యాలెంటెడ్. ► ఓకే... కట్నం విషయానికి వద్దాం. మీ రెండు కుటుంబాల మధ్య ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా? కట్నం అనేది మన సమాజ ప్రతిçష్ఠకు మచ్చ అని నేను అనుకుంటాను. నా కుటుంబ సభ్యులు కూడా కట్నం ఇవ్వాలనుకోరు. మా అత్తగారింట్లో కూడా అంతే! వాళ్ళు కట్నం తీసుకోవాలనుకునే మనుషులు కాదు. చాలా హుందా అయిన కుటుంబం. మంచి మనసున్నవాళ్లు. ► అత్తగారింట్లో ఎలా ఒదిగిపోవాలో మీ అమ్మగారి దగ్గర సలహాలేమైనా తీసుకున్నారా? మా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు చాలా కూల్. అలాగని సంప్రదాయాల విషయంలో లైట్‌గా ఉండరు. అన్నీ పాటించాల్సిందే! మా ఇంట్లో చిన్నప్పటి నుంచీ పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో నేర్పారు. కుటుంబ విలువల గురించి చెబుతూ పెంచారు. కుటుంబ మూలాలకు భంగం రాకుండా ఎలా నడుచుకోవాలో నేర్పించారు. అందుకని ఇప్పుడు ఇంకో కుటుంబంలోకి వెళుతున్నప్పటికీ అక్కడెలా ఉండాలో ప్రత్యేకంగా అడిగి తెలుసుకోలేదు. ► సో.. అత్తింట్లో ఎలా ఒదిగిపోవాలనే టెన్షన్ లేనట్లే... నా జీవితం చాలా బ్లెస్డ్. ఆ దేవుడు నాకు మంచి తల్లితండ్రులను ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో కుటుంబంలోనూ మంచి తల్లితండ్రులనే ఇచ్చాడు. అందుకే నాకు పెద్దగా టెన్షన్ లేదు. ► ఇంతకీ మీ పెళ్లి తేదీ చెప్పనేలేదు? (నవ్వేస్తూ...) తేదీ ఇంకా అనుకోలేదు. ‘వింటర్ వెడ్డింగ్’ అనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. ► మరి, సంగీత్, మెహందీ గురించి? వీలైనంతగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. వేడుకలన్నీ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొత్తగా ప్లాన్ చేస్తున్నాం. ► పెళ్ళయ్యాక... సినిమాల్లో కొనసాగుతారా? ఫ్యామిలీ లైఫ్‌నూ, ప్రొఫెషనల్ లైఫ్‌నూ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ► పెళ్లయ్యాక ఎక్కడ ఉంటారు? ముంబయ్‌లో నాకు ఇల్లు ఉంది. భవ్య ఢిల్లీలో ఉంటారు. సో... ఢిల్లీలోనే ఉంటాను. ► భవ్య తన లవ్‌ని ఎలా ప్రపోజ్ చేశారు? గత నెల భవ్య (ఫిబ్రవరి 16) బర్త్‌డేకి అండమాన్ వెళ్లాం. స్క్యూబా డైవింగ్ చేస్తున్నప్పుడు ‘విల్ యు మ్యారీ మీ’ (నన్ను పెళ్లి చేసుకుంటావా) అని అడిగారు. ఇలా ప్రపోజ్ చేస్తారని ఊహించలేదు. నీళ్లల్లో మోకాళ్ల మీద కూర్చుని అలా అడుగుతుంటే ముచ్చటేసింది. స్పెషల్‌గా, మ్యాజికల్‌గా అనిపించింది. భవ్య లవింగ్ అండ్ కేరింగ్. మంచి ఫ్యామిలీ మ్యాన్. అందగాడు, తెలివితేటలున్నవాడు. కాబోయే భర్తలో ఒక అమ్మాయి ఆశించే లక్షణాలున్న వ్యక్తి. ఆ పరంగా నేను చాలా లక్కీ. భవ్యను వద్దనుకోవడానికి నాకు కారణాలేమీ కనిపించలేదు. మెహరీన్‌కి భవ్య ప్రపోజ్ చేసిన వేళ ► పెళ్లి వేడుకల్లో కట్టుకునే చీరలు, పెట్టుకునే నగల గురించి? మా అమ్మమ్మ, మా అమ్మగారి ట్రెడిషనల్ జ్యుయెలరీ పెట్టుకోబోతున్నాను. ఇంకా ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ నగలు కూడా కొనుక్కుంటాను. మా అమ్మ పెళ్లిలో కట్టుకున్న బట్టలను, పెట్టుకున్న నగలను నా పెళ్లికి వాడాలనుకుంటున్నాను. ► మీ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఎన్ని గంటలు పడుతుంది? నేను సిక్కుల కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందుకని గురుద్వారాలో పంజాబీ సంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాతి రోజు సాయంత్రం హిందూ వెడ్డింగ్ ఉంటుంది. ఏదో ఒక్క ట్రెడిషన్నే ఫాలో అయి, పెళ్లి చేసుకోవాలని మేం అనుకోలేదు. రెంటికీ విలువ ఇవ్వాలి. – డి.జి. భవాని -
మజా మాల్దీవ్స్
‘కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్’ సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్డౌన్ ఎక్కడివాళ్లను అక్కడే లాక్ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు. వర్క్–వెకేషన్ వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్. షూటింగ్ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్ చేశారామె. బెస్ట్ బర్త్‌డే ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే చాలా స్పెషల్’ అంటూ ఫోటోలు షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్న బ్రేక్ గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్ చేశారు. హనీమూన్ కొత్త కపుల్ కాజల్ అగర్వాల్– గౌతమ్ కిచ్లు ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. పుట్టినరోజు వేడుకలు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. -
మన యుద్ధం మనమే చేయాలి..
‘‘ఆడవాళ్లందర్లోనూ అన్యాయాన్ని ఎదిరించగల దుర్గాదేవి అవతారముంది. అది తెలుసుకుని, ఆ శక్తిని బయటకు తీస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలం’’ అంటున్నారు రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి, అదా శర్మా, మెహరీన్, నభా నటేశ్. సమాజంలో స్త్రీ నెగ్గుకురావాలంటే దుర్గాదేవిలా మారాల్సి ఉంటుందా? ఆడవాళ్లకు పలు సమస్యలు ఉంటాయి. అవకాశం వస్తే మీరు పూర్తిగా నిర్మూలించాలనుకునే సమస్య ఏంటి? చెడును ఎదుర్కోవడానికి మీరు దుర్గాదేవిలా మారిన సందర్భాలేమైనా? దసరా పండగ సెలబ్రేషన్ గురించి? వంటి ప్రశ్నలకు రాశీ, అదా, లావణ్య, మెహరీన్, నభా చెప్పిన అభిప్రాయాలు దసరా ప్రత్యేకం. హద్దు దాటితే సహించను – మెహరీన్ ► తన క్యారెక్టర్ని తక్కువ చేసినా, తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా ఉన్నా, అనవసరమైన నిందలకు గురైనా తప్పకుండా దుర్గాదేవిలా మారాల్సిందే. ఏం జరిగినా సరే ఒకరి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆడవాళ్లను అగౌరవపర్చకూడదు. ► అసమానతను నిర్మూలించాలనుకుంటున్నాను. ఆడవాళ్లను బలహీనమైనవాళ్లలా చూస్తారెందుకో అర్థం కాదు. శారీరకంగా మగవాళ్ల అంత బలంగా ఆడవాళ్లు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఆడవాళ్లు ఎంత బలవంతులో అందరికీ తెలుసు. శారీరకంగానూ మాకు వీలైనంతగా చేస్తూనే ఉంటాం. ఎంతో సమర్థవంతంగా ఇంటి పనిని, ప్రొఫెషనల్ పనిని బ్యాలెన్స్ చేయగలం. మల్టీటాస్క్ చేయగలం. స్త్రీ, పురుషులందరూ సమానమే అనే భావన పెంపొందించాలి అందరిలో. ► నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. ఓపిక ఎక్కువ. నా పనేదో నేను చూసుకునే మనస్తత్వం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ వరకూ నేను కామ్‌గా ఉంటాను. అన్యాయంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా అస్సలు సహించలేను. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు నిలబడతాను. ► పండగ వస్తుందంటే నాకు భలే సంతోషమేస్తుంది. స్నేహితులు, బంధువులను కలవచ్చు. ప్రస్తుతం అందరం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కువమందితో కలిసి పండగలు జరుపుకునే పరిస్థితిలో లేము. ఇలాంటి సమయాల్లో ఒకరికోసం ఒకరు నిలబడదాం. మన కళ్లు కూడా ఆయుధమే – అదా శర్మ ► ప్రతీ ఒక్కరిలోనూ దుర్గాదేవి ఉంటుంది. కానీ కొందరు తెలుసుకోగలుగుతారు. కొందరికి తెలియదు.. అంతే. మన లోపల శక్తి దాగి ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రావాలి కూడా. ► ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కావడం చూస్తుంటాం. ఒకరిని ఒకరు తక్కువ చేయడం తీసేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ మరో స్త్రీ కోసం నిలబడాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలసి పైకి ఎదగాలి. ► చాలాసార్లు మారాను. కర్రను కూడా ఆయుధంగా చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు కళ్లను కూడా ఆయుధాలుగా మార్చుకోవచ్చు. ► దసరా పండగకి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి ముందు రంగోలీ వేస్తాను. ఇంటిని పూలతో అలంకరిస్తాను. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటాము. అందుకే తొమ్మిది అవతారాలు – నభా నటేశ్ ► ప్రతి ఒక్కరికి తనలో ఉన్న ప్లస్, మైనస్ కచ్చితంగా తెలియాలి. వాళ్ల బలమేంటో తెలుసుకుని బలహీనతలను తొలగించుకోవటం కోసం ఫైట్ చెయ్యాలి. దుర్గాదేవి ప్రపంచంలోని అందరికీ సమానమే, అందరికీ అమ్మే. దుర్గాదేవి అంటే ప్రపంచానికే శక్తి. ఆమె తెచ్చిన విజయంతోనే ప్రపంచానికి వెలుగొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా ఆడవాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని దానికోసం జీవితంలో కష్టపడాలి. దుర్గాదేవి చేసింది అదే. నాకు కావాల్సిందేంటో నాకు కచ్చితంగా తెలుసు, దానికోసం నేను అమ్మవారిలా ఫైట్ చేస్తాను. అదే నా బలం ఆనుకుంటాను. ► అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తను సాధించాలనుకున్నది సాధించింది. అందుకే ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది రకాలుగా తయారుచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఉంచి పూజ చేస్తారు. నేను పుట్టి పెరిగింది శృంగేరిలో. దేశంలోని శారదా శక్తి పీఠాల్లో అది కూడా ఒకటి. నవరాత్రి సమయంలో గుళ్లో అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆ అలంకారాలను చూసి భక్తితో మొక్కుతాను. ఆ అమ్మవారి అలంకారాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు అలా గుడికి వెళ్లి ఆడుకుంటూ సెలబ్రేషన్స్‌లో పిల్లలందరం పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ పండగలంటే నాకు చాలా శ్రద్ధ. వీలు కుదిరినంతవరకూ పూజలు చేస్తుంటాను. మన యుద్ధం మనమే చేయాలి – రాశీ ఖన్నా ► మనందరిలోనూ దుర్గాదేవి అవతారం ఉంటుంది. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే ఒక్కోసారి ఆ అవతారాన్ని బయటకు తీస్తేనే బతకగలం అనిపిస్తుంది. ఎప్పుడూ అమాయకంగా కూర్చోలేం కదా. కలియుగంలో మన యుద్ధం మనమే చేయాలి. ► మానభంగం, లింగ వివక్ష అనేది సమాజంలో లేకుండా చేయాలన్నది నా కోరిక. మన ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన బట్టలు వేసుకొని బయటకు వెళ్లడానికి ఎందుకు భయపడాలి? అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్పుదాం. రేప్ కేసుల్లో దోషుల మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికీ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. లింగ బేధాలు లేకుండా సమాన అవకాశాలు ఇవ్వగలగాలి? ► నా కోసం నేను నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని వచ్చాయి. నిలబడ్డాను. మా ఇంట్లో నాకు చిన్నప్పటినుంచీ ‘నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేయ్’ అని చెబుతూ వచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికే ఇష్టపడతాను. ముసుగులో మాట్లాడటానికి ఇష్టపడను. నాకోసం నేను నిలబడాల్సి వస్తే కచ్చితంగా ధైర్యంగా నిలబడతాను. ► చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోనే జరుపుకునేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక పండగలకు ఇంట్లో ఉండటం తక్కువైంది. షూటింగ్స్ హడావిడిలో ఉంటాం. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి రామ్‌లీలా చూడటానికి మా ఇంటి (ఢిల్లీ) దగ్గర ఉన్న గ్రౌండ్‌కి వెళ్లేదాన్ని. మాది చాలా పెద్ద కుటుంబం. పండగ వస్తే చాలు అందరం కలిసే వాళ్లం. పని వల్ల హైదరబాద్‌లోనే ఉండిపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే నా సూపర్ పవర్ – లావణ్యా త్రిపాఠి ► ఈ భూమ్మీద పుట్టిన ప్రతి స్త్రీలో దుర్గా మాత ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీలో శక్తి దాగుందని నేను నమ్ముతాను. మగపిల్లలు సూపర్‌హీరోస్ అయినట్లే అమ్మాయిలు అవసరమొచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలరు. అలాగే తమ గొంతును ప్రపంచానికి గట్టిగా వినిపించగలరు. తన అనుకున్నవారి కోసం నిలబడి ఫైట్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా ఆడపిల్లలపై నమ్మకాన్ని ఉంచటం అంతే. నేను వ్యక్తిగతంగా దుర్గామాతను నమ్ముతాను, నన్ను నేను దుర్గగా అనుకుంటాను. దుర్గ అంటే కోపం, భయం, ప్రేమ మాత్రమే కాదు ఆలోచనాపరమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఆమె ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ► మనకొచ్చే ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. స్త్రీ అనే కాదు ప్రతి ఒక్కరూ యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి. నేను చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాను. పరిష్కరించుకుంటాను కూడా. అదే నా సూపర్‌పవర్. నా కోపాన్ని ఎప్పుడూ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ► మా ఇంట్లో చిన్నపిల్లలకు పండగ విశేషాలు చెప్పడం నా అలవాటు. నేను నా మేనకోడలికి కొంచెం క్రియేటివ్‌గా స్కెచ్‌తో బొమ్మలేసి, రాక్షస సంహారం ఎందుకు జరిగింది? దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? అనే విషయాలు చెప్పాను. రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటాం అని చెప్పాను. అలా చెప్తేనే కదా మన సంస్కృతి సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్‌లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్‌గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్‌లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement