వారికి ఆ అర్హత లేదు

17 Jun, 2019 03:10 IST|Sakshi
చేతన్, కాశిష్, మంజునాథ్, నరేశ్‌కుమార్, అనిల్‌ రావిపూడి, మారుతి

‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమా చూడనప్పుడు రొటీన్‌ సినిమాలు ఎందుకు వస్తున్నాయని కామెంట్‌ చేసే అర్హత లేదని నా నమ్మకం. నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన మంజునాథ్‌గారికి థ్యాంక్స్‌. నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయడానికి రెడీ’’ అని చేతన్‌ అన్నారు. నరేష్‌కుమార్‌ దర్శకత్వంలో చేతన్‌ మద్దినేని, కశిష్‌ ఓరా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’. ‘విద్య 100%.. బుద్ధి 0%’ అనేది ఉపశీర్షిక. మంజునాధ్‌ వి. కందుకూర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘టైటిల్‌ లాగే సినిమా కూడా మంచి మార్కులు పొందాలి. టీమ్‌కి నా బెస్ట్‌ విషెష్‌’’ అన్నారు. ‘‘ఈ పాత్రకి చేతన్‌ తప్ప వేరెవరూ న్యాయం చేసేవారు కారు. చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్‌ అయిపోయాడు. మంజునాథ్‌గారు, నరేష్‌గారు తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు డైరెక్టర్‌ మారుతి. ‘‘సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌తోనే ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’ చిత్రం చేశాను. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఈ సినిమా చేశాం’’ అన్నారు నిర్మాత మంజునాథ్‌. ‘‘లైఫ్‌లో విద్య మాత్రమే కాదు.. బుద్ధి కూడా ఉండాలి’ అనే మెసేజ్‌తో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు నరేశ్‌. ‘‘నా కెరీర్‌లో చూసిన బెస్ట్‌ స్క్రిప్ట్‌ ఇది’’ అన్నారు కాశీష్‌ ఓహ్రా.

మరిన్ని వార్తలు