రాజమాత టు రాష్ట్రమాత

21 Dec, 2018 03:21 IST|Sakshi
రమ్యకృష్ణ

పాత్ర ఎంత క్లిష్టంగా ఉన్నా కూడా తాను అలవోకగా చేయగలనని నిరూపిస్తూ వస్తూనే ఉన్నారు రమ్యకృష్ణ. ‘నరసింహ’లోని నీలాంబరి, ‘బాహుబలి’లో శివగామి వంటి పాత్రలు అందుకు ఉదాహరణలు. ఇప్పుడు అలాంటిదే మరో చాలెంజింగ్‌ పాత్రకు రెడీ అయ్యారట రమ్యకృష్ణ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రను పోషించనున్నారట. ఆల్రెడీ జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో మూడు సినిమాలు రూపొందనున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇది మరో సినిమానా అంటే కాదు.. ఇది వెబ్‌ సిరీస్‌ అట. ‘ఘర్షణ, ఏ మాయ చేసావె’ ఫేమ్‌ గౌతమ్‌ మీనన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేయనున్నారట. 30 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో జయలలిత జీవితానికి సంబంధించిన అన్ని ఘట్టాలను కవర్‌ చేయనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను అల్లు అరవింద్‌ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్‌ (బాబీ) నిర్మించనున్నారు అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ నిర్మాణంలో ఆయన భాగం కారని వెంకటేశ్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు