ఇక 'గల్లీ బాయ్‌'కు ఆస్కార్‌ లేనట్టే!

17 Dec, 2019 14:22 IST|Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ జోయా అక్తర్‌ తెరకెక్కించిన 'గల్లీ బాయ్‌' ఆస్కార్ రేసులో లేదు. సోమవారం 92వ ఆస్కార్‌ అవార్డులకు సంబంధించి ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విడుదల చేసిన టాప్ -10 అర్హత చిత్రాల లిస్ట్‌లో గల్లీబాయ్‌ పేరు లేదు. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద ఆస్కార్‌కు అర్హత సాధించిన 91 చిత్రాల్లో  చివరకు కేవలం 10 మాత్రమే ఆస్కార్‌ బరిలో నిలిచాయి. బాలీవుడ్‌ నటులు రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా కలిసి నటించిన గల్లీ బాయ్  చిత్రం 92వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారత్‌ తరఫున ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఎంపికైంది. కానీ ఆస్కార్‌ అవార్డుకు ఎంపిక చేసిన 10 చిత్రాల్లో గల్లీబాయ్‌ చోటు దక్కించుకోలేదు. కాగా ఫిబ్రవరి 9న ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమం జరగనుంది.
 
ఆస్కార్‌ బరికి ఎంపిక చేసిన పది చిత్రాలు:
1) ది పెయింటెడ్ బర్డ్ (చెక్ రిపబ్లిక్)
2) ట్రూత్ అండ్ జస్టిస్ (ఎస్టోనియా)
3) లెస్ మిజరబుల్స్ (ఫ్రాన్స్) 
4) దోజ్‌ హు రిమెయిన్డ్‌ (హంగరీ)
5) హనీలాండ్ (నార్త్ మాసిడోనియా)
6) కార్పస్ క్రిస్టి (పోలాండ్)
7) బీన్‌పోల్ ( రష్యా)
8) అట్లాంటిక్స్ (సెనెగల్)
9) పారాసైట్‌ (దక్షిణ కొరియా) 
10)పెయిన్‌ అండ్‌ గ్లోరీ (స్పెయిన్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు