హిందీలో... ‘హ్యారీ పోటర్’కథానాయిక?

2 Jul, 2015 02:37 IST|Sakshi
హిందీలో... ‘హ్యారీ పోటర్’కథానాయిక?

‘హ్యారీ పోటర్’ మూవీ సిరీస్‌లో బాలనటిగా సినీ కెరీర్‌ను ప్రారంభించి, ఇప్పుడు కథానాయికగా కుర్రకారును ఓ ఊపు ఊపుతున్న హాలీవుడ్ అమ్మాయి ఎమ్మా వాట్సన్. ఆమె త్వరలో బాలీవుడ్ తెరపై కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ పాత్రికేయుడు జ్యోతిర్మయీ డే జీవితం ఆధారంగా నందితా సింఘా అనే దర్శకురాలు ఓ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. మాఫియాకు వ్యతిరేకంగా వార్తలు రాసిన కారణంగా ఆయన హత్యకు గురయ్యారు. సాహసోపేతమైన ఆయన జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నందిత ఈ చిత్రానికి పూనుకున్నారు. జ్యోతిర్మయి పాత్రను నటుడు ఆమీర్‌ఖాన్ పోషించనున్నట్లు సమాచారం. అలాగే ఇందులో బ్రిటన్ పాత్రికేయురాలి పాత్ర ఉందట. ఆ పాత్రను హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ చేయనున్నారని బాలీవుడ్ టాక్.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా