'ఆ సీన్లు ఉంటే బాగుండేది'

25 May, 2016 20:33 IST|Sakshi
'ఆ సీన్లు ఉంటే బాగుండేది'

న్యూఢిల్లీ: తాను చేసే ప్రతి పనిలో ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉంటానని బాలీవుడ్ నటి రిచా చద్ధా అంటోంది. 'ఓయ్ లక్కీ ఓయ్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రిచా చద్ధా. ఆమె నటించిన 'ఔర్ దేవదాస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగతున్నాయి. ఓమంగ్ కుమార్ తీస్తున్న 'సరబ్ జిత్' మూవీ నిడివిగా తగ్గించారని చెప్పింది. దీంతో తాను నటించిన 10 సీన్లలో దాదాపు 8వరకు తొలగించనున్నారని, అంతేకాదు ఐశ్వర్యరాయ్ చేసిన 20 సీన్లలో 6 సీన్లకు కత్తెర వేశారట. 'సరబ్జిత్' లో నటనకుగానూ ఈ అమ్మడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సీన్లు కట్ చేశారని తాను కంప్లెంట్ చేయడం లేదని జస్ట్ ఈ విషయాన్ని చెబుతున్నానంది. ఇలాంటి విషయాలను తాను లెక్కచేయనని, చేసే పనిపై ఎప్పుడూ కాన్ఫిడెంట్ గా ఉండటం అలవాటని చెప్పుకొచ్చింది. తాను నటించిన సీన్లు తొలగించకపోతే మూవీకి ఎంతో ఉపయోగపడేవని, చివరికి మూడు, నాలుగు సీన్లే మిగిలాయని ముద్దుగుమ్మ కాస్త దిగులు చెందుతోంది. క్యాబరే'లో స్మోకింగ్ సీన్లలో కూడా అద్భుతంగా నటించింది. డైరెక్టర్ చెప్పినట్లు రియల్ గానే స్మోక్ చేయడంతో హెల్త్ అప్ సెట్ అయిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి