అందుకే నా సినిమా కలెక్షన్స్‌ తగ్గుతున్నాయి: సల్మాన్‌ ఖాన్‌

2 Dec, 2023 08:52 IST|Sakshi

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ‘షేర్షా’ ఫేమ్‌ విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో ‘ది బుల్‌’ అనే సినిమా తెరకెక్కనుంది. కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మార్చిలో ప్రారంభం కానుందని బాలీవుడ్‌ సమాచారం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో పారా మిలిటరీ ఆఫీసర్‌గా సల్మాన్‌ ఖాన్‌ నటిస్తారని టాక్‌. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. 

ఇక తన సినిమాల వైఫల్యాల (‘అంతిమ్, కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’లను ఉద్దేశిస్తూ..) గురించి కూడా సల్మాన్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నా సినిమాలు విడుదలైనప్పుడు, ఆ సినిమాల టికెట్‌ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ధరలతో విడుదల చేస్తే ఆ సినిమాల కలెక్షన్స్‌ కూడా భారీగానే ఉంటాయి.  నా తర్వాతి సినిమాను అలాగే రిలీజ్‌ చేయాలనుకుంటున్నాను’ అని సల్మాన్‌ అన్నారు. అంతేకాదు.. తక్కువ సినిమా టికెట్‌ ధరలతో ప్రజల డబ్బును మేం సేవ్‌ చేస్తున్న విషయం అందరికీ సరిగ్గా అర్థం కావడం లేదని కూడా సల్మాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు