సంక్రాంతికి ఫిక్స్‌

22 Dec, 2018 02:51 IST|Sakshi
రజనీకాంత్‌

ఇందుమూలంగా యావన్మంది ప్రేక్షక లోకానికి తెలియజేయడం ఏమనగా రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం ‘పేట’ సంక్రాంతికి విడుదల అవుతోందహో.. రజనీకాంత్‌ హీరోగా, త్రిష, సిమ్రాన్‌ హీరోయిన్లుగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో నిర్మాత వల్లభనేని అశోక్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సర్కార్, నవాబ్‌’ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మా బ్యానర్‌లో ‘పేట’ సినిమా హ్యాట్రిక్‌ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. రజనీ అభిమాని అయిన కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమా తెరకెక్కించిన విధానం  ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంది. అనిరు«ద్‌ చక్కటి సంగీతం ఇచ్చారు. అటు మాస్, ఇటు క్లాస్‌ ఆడియన్స్‌ని కట్టిపడేసే కమర్షియల్‌ అంశాలున్న మా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అన్నారు. విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్‌ సిద్దిఖీ తదితరులు నటించారు.

మరిన్ని వార్తలు