-

'నేను హృతిక్ కు పెద్ద అభిమానిని'

4 Jul, 2015 16:34 IST|Sakshi
'నేను హృతిక్ కు పెద్ద అభిమానిని'

ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. పద్నాలుగు సంవత్సరాల క్రితం 'కహోనా.. ప్యార్ హై' చిత్రంతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన హృతిక్ ఆపై తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నాడు. జాక్రీషాఫ్ కుమారుడైన టైగర్ ష్రాఫ్ కు హృతిక్ అంటే యమ క్రేజ్ అట.  ఎంతగంటే హృతిక్ ను సూపర్ హీరోగా పోల్చాడు. తాను ఏది అనుసరించిన హృతిక్ నే స్ఫూర్తిగా తీసుకుంటానన్నాడు. 'నేను చేసే ప్రతీ పనికి హృతిక్ ను దేవుడుగా భావిస్తా. నేను చేసే డ్యాన్స్ హృతిక్ తరహాలో ఉంటుందని అందరూ అనడం గొప్ప ఫీలవుతా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా  ఆ హీరో నా హృదయంలో చెరగని ముద్ర వేశాడు'అని పేర్కొన్నాడు. 

 

ముంబైలోని ప్లానెట్ ఫ్యాషన్ కార్యక్రమానికి హాజరైన టైగర్ ష్రాఫ్ పై విధంగా స్పందించాడు.  కాగా, ఏబీసీడీ-3 కి తనకు ఆఫర్ వచ్చిందన్న వార్తలను మాత్రం ఖండించాడు. అదొక హిట్ సిరీస్ అని.. అందొలో తనకు ఎటువంటి ఆఫర్ రాలేదన్నాడు.